గుంటూరు కారం టీమ్ కి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

Published : Jan 10, 2024, 07:18 PM IST
గుంటూరు కారం టీమ్ కి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

సారాంశం

గుంటూరు కారం మూవీ నిర్మాతల ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. టికెట్స్ ధరలు పెంచుతూ అనుమతులు జారీ చేసింది.   

గుంటూరు కారం మూవీ భారీ బడ్జెట్ మూవీ కావడంతో టికెట్స్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలని నిర్మాతలు ఏపీ ప్రభుత్వానికి అభ్యర్థన చేశారు. నిర్మాతల ప్రతిపాదనపై స్పందించిన ఏపీ ప్రభుత్వం టికెట్స్ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 50 రూపాయలు అధికంగా టికెట్స్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వడం జరిగింది. అమలులో ఉన్న టికెట్స్ ధరలకు అదనంగా యాభై రూపాయలు ప్రతి టికెట్ పై పెంచి విక్రయించే వెసులుబాటు కలిగింది. 

తెలంగాణ ప్రభుత్వం సైతం గుంటూరు కారం టికెట్స్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో రూ. 65, మల్టీప్లెక్స్ లలో రూ. 100 రూపాయలు అదనంగా టికెట్స్ ధరలకు అనుమతులు ఇవ్వడమైంది. ఇది గుంటూరు కారం చిత్ర ఓపెనింగ్స్ కి అనుకూలించే అంశం. తెలంగాణలో అర్ధరాత్రి స్పెషల్ షోలకు కూడా అనుమతులు ఇవ్వడమైంది. 

గుంటూరు కారం చిత్రం జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ గుంటూరు కారం తెరకెక్కించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. రమ్యకృష్ణ ఈ చిత్రంలో మహేష్ తల్లి పాత్ర చేయడం విశేషం. ప్రకాష్ రాజ్ సైతం ఓ కీలక రోల్ చేశారు. థమన్ సంగీతం అందించారు. 

PREV
click me!

Recommended Stories

Sobhita Dhulipala: శోభితకు ఇష్టమైన సినిమా అదే, ఆమె భర్త చైతూది మాత్రం కాదు
Vishwambhara First Review: విశ్వంభర అప్‌డేట్‌, జేమ్స్ కామెరూన్‌ రేంజ్‌ విజువల్స్.. హైలైట్స్ ఇవే, సమస్య ఏంటంటే?