#Hit2:‘హిట్ 2’ఓటిటిలో రిలీజైంది కానీ...ఓ ట్విస్ట్

By Surya Prakash  |  First Published Jan 4, 2023, 11:13 AM IST

ఓటీటీ ట్రేడ్ లో ... హిట్ 2 చిత్రానికి భారీగా బిజెనెస్ జరిగిందని తెలుస్తోంది. ప్రముఖ డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో హిట్ 2 చిత్ర స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.  



 అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. హీరో నాని నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా థియేటర్ లో బాగానే వర్కవుట్ అయ్యింది. రివ్యూలు యావరేజ్ అనిపించుకున్నా...రెవిన్యూ మాత్రం అదిరిపోయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రైట్స్ కూడా ాగా వెళ్లాయని సమాచారం. దాంతో తాము ఎక్కువ రేటు పెట్టి కొన్న ఈ సినిమా నుంచి రెవిన్యూ అదే స్దాయిలో జనరేట్ చేయాలని ప్లాన్ చేసింది.  వివరాల్లోకి వెళితే...

ఓటిటి సంస్దలు క్రేజ్ ఉన్న సినిమాలను క్యాష్ చేసుకోవటంలో ఎప్పుడూ ముందు ఉంటున్నాయి. తాజాగా  హిట్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ మోస్ట్ అవైటింగ్ సినిమాని ఏమాత్రం ఆలస్యం చేయకుండా న్యూ ఇయర్ సందర్భంగా ఓటిటి రిలీజ్ చేసేసింది. కానీ, ఇక్కడే అమెజాన్ ప్రైమ్ వారు ఓ కండిషన్ పెట్టారు. ప్రెజెంట్ ఈ సినిమాని చూడాలంటే.. రెంట్ పద్దతిలో అందుబాటులో ఉంచింది. రూ. 129 చెల్లించి హిట్ 2ని ఇప్పుడు చూడవచ్చు.

Latest Videos

అయితే.. జనవరి 6వ తేదీ నుండి మాత్రం సినిమాని ఫ్రీగా చూసేయొచ్చని సమాచారం. కాగా.. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్, సుహాస్, రావు రమేష్ కీలకపాత్రలలో నటించారు.  ఇక ఓటీటీ ట్రేడ్ లో ... హిట్ 2 చిత్రానికి భారీగా బిజెనెస్ జరిగిందని తెలుస్తోంది. ప్రముఖ డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో హిట్ 2 చిత్ర స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.  హిట్ టాక్ తెచ్చుకునవ్న ఈ సినిమాని భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ సినిమా హక్కుల కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ కూడా తీవ్రంగా పోటీ పడగా.. చివరకు ప్రైమ్ వీడియోకే భారీ ధరకు ఈ రైట్స్ దక్కాయి.

ఈ సినిమాకి ఓపెనింగ్స్ అడివి శేష్ కెరీర్ లో బెస్ట్ .   హిట్ టాక్ వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు మూడు రోజుల వీకెండ్ కలెక్షన్స్ దుమ్ము రేపాయి. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ 'హిట్ 2' లో అడివి శేష్ ఓ మర్డర్ మిస్టరీ పరిశోధన చేసే అధికారిగా కనపడతాడు.  కలెక్షన్స్ వైజ్ గా సినిమా బాగానే వర్కవుట్ అయ్యింది.
 
ఇక  హిట్‌ 2లో  రొటీన్ ట్విస్ట్  అయినా...  స్క్రీన్ ప్లే బాగుంటుంది.హత్య చేసింది సీరియల్‌ కిల్లర్‌ అనే ముందే చెప్పారు.  ఆ కిల్లర్ ఎవరు?  ఎందుకు అమ్మాయిలనే చంపుతున్నారనేది సస్పెన్స్‌గా పెట్టారు. ఫస్టాఫ్‌ అంతా  సింపుల్‌గా కొనసాగుతుంది. హీరో రొమాన్స్‌.. మధ్యలో కేసు విచారణ.. ఈక్రమంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ కూడా సింపుల్‌గా ఉంటుంది. సెకండాఫ్‌ నుంచి కథ పరుగులు పెట్టించటమే కలిసొచ్చింది.నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా పనిచేయగా.. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. 

click me!