పవన్ కళ్యాణ్ తో సురేష్ బాబు గొడవ... నిజమేనన్న స్టార్ ప్రొడ్యూసర్, చిక్కు ఎక్కడ వచ్చింది?

Published : Jul 06, 2024, 07:56 PM ISTUpdated : Jul 06, 2024, 07:58 PM IST
పవన్ కళ్యాణ్ తో సురేష్ బాబు గొడవ... నిజమేనన్న స్టార్ ప్రొడ్యూసర్, చిక్కు ఎక్కడ వచ్చింది?

సారాంశం

స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు-పవన్ కళ్యాణ్ మధ్య విబేధాలు తలెత్తాయనే వాదన ఉంది. అప్పట్లో ఇది టాలీవుడ్ హాట్ టాపిక్. ఈ విషయం పై సురేష్ బాబును వివరణ అడగ్గా.. నిజమే అన్నారు.   

సురేష్ బాబు సీనియర్ ప్రొడ్యూసర్. తండ్రి రామానాయుడు వారసుడిగా పలు భాషల్లో అనేక చిత్రాలు నిర్మించారు . సురేష్ బాబుకు చాలా సౌమ్యుడు అనే పేరుంది. ఆయన మీడియా ముందుకు కూడా అరుదుగా వస్తారు. తమ చిత్రాల ప్రొమోషన్స్ లో మాత్రమే కనిపిస్తారు. ఓ ఇంటర్వ్యూలో సురేష్ బాబు వ్యక్తిగత విషయాలతో పాటు పవన్ కళ్యాణ్ తో తలెత్తిన వివాద నేపథ్యం పంచుకున్నారు. 

వయసులో సురేష్ బాబు హీరో కమల్ హాసన్ వలె ఉండేవాడట. వీరిద్దరి కారు మోడల్ కూడా ఒకటేనట. దాంతో చాలా మంది తనను కమల్ హాసన్ అని పొరపడేవారట. దర్శకుడు భారతీరాజా సురేష్ బాబును హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారట. అప్పట్లో స్టార్ డైరెక్టర్ గా ఉన్న భారతీరాజా ఆఫర్ ని సురేష్ బాబు తిరస్కరించారట. నాకు హీరో కావడం ఇష్టం లేదని అన్నారట. మొదటి నుండి సురేష్ బాబుకు బిజినెస్ చేయాలనే ఆసక్తి ఉండేదట. అందుకే నిర్మాత అయ్యానని ఆయన అన్నారు. 

ఇక గోపాలా గోపాలా మూవీ విషయంలో మీకు పవన్ కళ్యాణ్ కి మధ్య గొడవలు జరిగాయనే వాదన ఉంది... నిజమేనా? అని  అడగ్గా,  అవునని సురేష్ బాబు సమాధానం చెప్పాడు. పవన్ కళ్యాణ్ తో విబేధాలు తలెత్తిన మాట వాస్తవమే. కానీ తర్వాత అన్నీ సర్దుకున్నాయి. ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం నాకు సంతోషాన్ని కలిగించిందని సురేష్ బాబు అన్నారు. గొడవకు కారణాలు మాత్రం ఆయన చెప్పలేదు. 

కాగా గతంలో మాదిరి సురేష్ బాబు భారీ చిత్రాలు తెరకెక్కించడం లేదు. మీడియం, లో బడ్జెట్ చిత్రాల నిర్మాణం  మీద దృష్టి పెడుతున్నారు. సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఆయన డిస్ట్రిబ్యూటర్ కూడాను. తెలుగు రాష్ట్రాల్లో అనేక థియేటర్స్ మీద ఆధిపత్యం చలాయిస్తున్నారు. చెప్పాలంటే ఒకప్పటి వైభవం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కి ఇప్పుడు లేదు. కొత్త నిర్మాణ సంస్థలు వచ్చాక రేసులో వెనుకబడింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sri Chidambaram Garu Review: `శ్రీ చిదంబరం గారు` మూవీ రివ్యూ.. మెల్ల కన్ను వెనుక ఇంత కథ ఉందా?
ప్రకాశ్ రాజ్ రంగంలోకి దిగాడు, కంగనా పై ఫైర్.. ఏఆర్ రెహమాన్‌కు సపోర్ట్ గా కామెంట్స్..