
టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రిత నాయుడు(Supritha Nayudu) రాకీ జార్డన్ జంటగా, నరేష్ అమనేని డైరెక్షన్ లో రూపొందిన "వెళ్ళిపో" మ్యూజిక్ వీడియో ను ప్రేమికుల రోజున సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సురేఖ వాణి, రాకీ జార్డన్, సుప్రీత నాయుడు, డైరెక్టర్ నరేష్ అమరనేని , సినిమాటోగ్రాఫర్ రవి, సాయి యశ్వంత్ , శ్యామ్ వాడవల్లి, సుర్య సుబ్రహ్మణ్యం, గురు స్వామి తదితరులు పాల్గొన్నారు
డైరెక్టర్ నరేష్ అమరనేని మాట్లాడుతూ రాకీ తన దగ్గరకి వచ్చి సాంగ్ చూపించి డైరెక్ట్ చేయమన్నాడని, అప్పుడు రెగ్యులర్ గా కాకుండా హాలీవుడ్, బాలీవుడ్ లలో వస్తున్న కొత్త విధానాన్ని అనుసరించాలని అనుకున్నట్టు తెలిపారు. అదే కాన్సెప్ట్ ను రాకీ కి చెప్పాను, అతనికి నచ్చి వెంటనే స్టార్ట్ చేశామన్నారు. ఇందుకు సహకరించిన రాకీకి థ్యాంక్స్ తెలిపారు. సుప్రీత నాయుడు మాట్లాడుతూ.. వెళ్లిపో మ్యూజిక్ వీడియో చేసిన తరువాత ఇది నేనేనా చేశానా అనిపించింది. నేను చేయలేను అంటున్నా నువ్వు చేయగలవు అంటూ ఎంతో ఓపికతో నన్ను యాక్ట్ చేయించారు డైరెక్టర్ నరేష్. ఈ రోజు మా ఫాదర్ వుంటే ఎంతో హ్యాపీగా ఫీలయ్యే వారు అని తెలిపింది.
రాకీ జార్డన్ మాట్లాడుతూ: మా ఫ్రెండ్స్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు, నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా "వెళ్ళిపో" లాంటి మ్యూజిక్ వీడియో లు చేయాలని నాకోరిక. అది నెరవేరిననందుకు హ్యాపీ గా ఉందన్నాడు. ఇక నటి సురేఖ వాణి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ లో మా అమ్మాయిని ఇన్వాల్వ్ చేయడానికి కారణం డైరెక్టర్ నరేష్ మీద ఉన్న నమ్మకం. మొదట వద్దు అనుకున్నాం అయితే నరేష్ నేను చేయించుకోగలను అని చెప్పడం, కాన్సెప్ట్ నచ్చడం తో సుప్రీత యాక్ట్ చేసింది. ఈ మ్యూజిక్ వీడియో ఇంత అందంగా బాగా రావడానికి కారణం నరేష్ హార్డ్ వర్క్.. రాకీ బాగా నటించాడు. డీవోపీ రవి ప్రతి ఫ్రేమ్ ను చక్కగా చూపించాడని ప్రశంసించారు.
ఈ మ్యూజిక్ వీడియోకు సింగర్ గా రేవంత్, లిరిసిస్ట్ గా రాకీ జార్డన్, మ్యూజిక్ తేజా కునూరు వ్యవహరించగా బ్యాచిలర్ కొంప ప్రొడక్షన్ వారు నిర్మించారు. డీవోపీ రవి బోయిడపు, ఎడిటింగ్: శ్యామ్ వాడవల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి యశ్వంత్ గల్లా, లైన్ ప్రొడ్యూసర్; సూర్య సుబ్రమణ్యం సహకరించారు.