వైఎస్ షర్మిలని దారుణంగా ట్రోల్ చేసిన సురేఖ వాణి.. నీకు దండం పెడతా తక్కువ మాట్లాడు అంటూ..

Published : May 06, 2023, 12:44 PM IST
వైఎస్ షర్మిలని దారుణంగా ట్రోల్ చేసిన సురేఖ వాణి.. నీకు దండం పెడతా తక్కువ మాట్లాడు అంటూ..

సారాంశం

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా గడిపిన సురేఖ వాణి ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఒకటి అర చిత్రాల్లో మాత్రమే కనిపిస్తోంది. అయితే సురేఖ వాణి ట్రెండుకి తగ్గట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా గడిపిన సురేఖ వాణి ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఒకటి అర చిత్రాల్లో మాత్రమే కనిపిస్తోంది. అయితే సురేఖ వాణి ట్రెండుకి తగ్గట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. సురేఖ వాణి కుమార్తె సుప్రీతా కూడా ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. 

సురేఖ వాణి అక్క, వదిన, తల్లి పాత్రలతో సురేఖ వాణి బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం సురేఖ వాణికి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.  తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. 

కానీ తమపై వచ్చే ట్రోలింగ్ కి సురేఖ వాణి, సుప్రీత రియాక్ట్ అవ్వరు.తమ లైఫ్ తమ ఇష్టం అన్నట్లుగా ఎంజాయ్ చేస్తుంటారు. సురేఖ వాణి కుమార్తె సుప్రతతో కలసి తరచుగా వెకేషన్స్ కి వెళుతూ ఉంటుంది.   

 

అయితే ఇటీవల సురేఖ వాణి.. వైఎస్ షర్మిలపై ఎక్కువగా ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తున్న వీడియోలు పోస్ట్ చేస్తోంది. అయితే షర్మిలని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. షర్మిల తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో వైరల్ అవుతుంటాయి. 'పాదయాత్ర అంటే పాదాలమీద నడిచే యాత్ర'.. ఆడబిడ్డ అని ఎందుకు అంటారంటే ఆడబిడ్డ కాబట్టి.. స్టూడెంట్స్ అని ఎందుకు అంటారు వారు యువత కాబట్టి లాంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

తాజాగా సురేఖ వాణి.. స్టూడెంట్స్ అని ఎందుకు అంటారు యువత కాబట్టి అని షర్మిల చేసిన వ్యాఖ్యలని ఇమిటేట్ చేస్తూ వీడియో చేసింది.ఈ వీడియోలో వీడియోలో డీజే టిల్లు డైలాగ్స్ ని సెటైరికల్ గా పెట్టింది. నీకు దండం పెడతా.. నువ్వు ఎంత తక్కువ పాజిబుల్ అయితే అంత తక్కువ మాట్లాడు రాధిక.. నాకు టిపికల్ యాంగ్జైటీ వస్తోంది అని డైలాగ్స్ పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా