అమ్మ నువ్వు వారియర్.. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఎమోషనల్ పోస్ట్...

Published : May 06, 2023, 10:05 AM ISTUpdated : May 06, 2023, 10:06 AM IST
అమ్మ నువ్వు వారియర్.. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఎమోషనల్ పోస్ట్...

సారాంశం

బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్.  తాజాగా ఆయన తన తల్లికి సబంధించిన  ఎమోషనల్ పోస్ట్ ఒకటి శేర్ చేసుకున్నారు. 

బాలీవుడ్ యంగ్ హీరో యువ హీరో కార్తీక్ ఆర్యన్. రీసెంట్ గా అలవైకుంఠపురం హిందీ రీమేక్ మూవీ షెహజాదాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆర్యన్ కు.. ఈసినిమాతో నిరాశ ఎదురయ్యింది. అంతకు ముందు  భూల్ భూలయ్య 2 సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు కార్తిక్. కార్తీక్ కు బాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లవర్ బాయ్ ఇమేజ్ తో పాటు..ప్లే బాయ్ గా కూడా కార్తీక్ ఆర్యన్ అంటే లేడీ ఫ్యాన్స్ పడి చచ్చిపోతుంటారు. 

ప్రస్తుతం బాలీవుడ్ లో ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. కార్తీక్ ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా అతను చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.తాజాగా కార్తీక్ ఆర్యన్ తన తల్లితో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు కార్తీక్..  కొన్ని రోజుల క్రితం మా కుటుంబంలోకి క్యాన్సర్ ప్రవేశించింది.  మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నించింది. కానీ అమ్మ మాత్రం నిరుత్సాహపడకుండా ధైర్యంగా పోరాడి క్యాన్సర్ పై గెలిచింది. అమ్మా నువ్వు వారియర్... 

 

 ఎప్పుడూ దేనికి ఓడిపోకూడదనే ఆమె మనస్తత్వమే ఆమెను క్యాన్సర్ ని జయించేలా చేసింది. మా ప్రేమ,సపోర్ట్ అంతా ఆమెకు ఎప్పుడూ ఉంటుంది. అమ్మ ప్రేమను మించిన శక్తి .. అంతకంటే గొప్పది ఇంకోటి లేదు అని పోస్ట్ చేశాడు. అమ్మ క్యాన్సర్ వారియర్ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్తీక్ ఆర్యన్ కు ధైర్యంగా ఉండేలా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు..  పలువురు అభిమానులు, నెటిజన్లు కార్తిక్ తల్లిని అభినందిస్తూ, కార్తిక్ ని ధైర్యంగా ఉండమని కామెంట్స్ చేస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్