నెల తిరక్కుండానే ఓటీటీ బాట పట్టిన శాకుంతలం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Published : May 06, 2023, 11:48 AM IST
నెల తిరక్కుండానే ఓటీటీ బాట పట్టిన శాకుంతలం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సారాంశం

ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయ్యి... నిరాశపరిచింది సమంత శాకుంతలం సినిమా. ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎక్కడానికి రెడీ అవుతోంది  మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? 

సమంత నటించిన శాకుంతలం సినిమా... ఏప్రిల్ 14న థియేటర్స్ లో రిలీజయింది. ఎన్నో అంచాల నడుమ రిలీజ్ అయిన  ఈసినిమా.. ప్రేక్షకులను నిరాశపరిచింది. అంతే కాదు.. ఎంతో కష్టపడ్డ మూవీ టీమ్ కు కూడా నిరాశ తప్పలేదు. భారత పురాణాలు ఆధారంగా.. ఈసినిమా కథ తయారు చేశారు.  దుశ్యంతుడు-శకుంతల జీవితం ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా తెరకెక్కింది.శకుంతలగా  సమంత, దుశ్యంతుడిగా  దేవ్ మోహన్... నటించగా. చిన్నారి భరతుడి పాత్రలో.. అల్లు అర్హా నటించగా.  మోహన్ బాబు, అనన్య నాగళ్ళ.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. 

 శాకుంతలం సినిమా  భారీ బడ్జెట్ తో.. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కింది. ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలో చేశారు మూవీ టీమ్. ఎంత ప్రయత్నం చేసినా.. ఎంత జాగ్రత్తగా అడుగులు వేసినా.. ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది శాకుంతలం సినిమా. భారీ ఎత్తున ప్లాన్ చేసిన ఈసినిమా ప్రేక్షకులని మెప్పించలేక డిజాస్టర్ గా మిగిలింది. అంతే కాదు ఈమూవీ నిర్మాత దిల్ రాజుకు దాదాపు 30 కోట్ల నష్టం కూడా వచ్చినట్టు టాక్. ఈక్రమంలో ఈ సినిమాకు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇక రిలీజ్ అయ్యి నెలరోజులు గడవకముందే ఓటీటీలో స్క్రీమింగ్ అవ్వబోతోంది శాకుంతలంసినిమా. మే 12న అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది.  ఇక ప్లాప్ టాక్ రావడంతో.. థియేటర్ కు వెళ్లి ఈసినిమా చూడలేని వారు ఓటీటీలో హ్యాపీగా  ఈసినిమాను చూడటానికి రెడీ అవుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా