
తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ(బిగ్‌బాస్ నాన్‌స్టాప్)(Bigg Boss Non Stop) రసవత్తరంగా సాగుతుంది. బిగ్‌బాస్ 6వ(Bigg Boss 6) సీజన్‌ని ఓటీటీలో ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెలుగులో ఇది రన్ అవుతుంది. ఇప్పటికే వారం రోజులు పూర్తి చేసుకుంది. ఇందులో సీనియర్లని వారియర్స్ గా, కొత్తకంటెస్టెంట్లని ఛాలెంజర్స్ గా విభజించారు. తొలి వారం ముమైత్‌ఖాన్ ఎలిమినేట్ అయ్యారు. రెండో వారం నామినేషన్ ప్రక్రియ పీక్‌లోకి వెళ్లింది. నామినేషన్స్ చేసే ప్రక్రియలో ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి.
Bigg Boss Telugu OTT సోమవారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. వారియర్స్ టీమ్ నుంచి ఒక్కో కంటెస్టెంట్ ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాల్సి ఉంటుంది. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తి ఫొటోపై కత్తి గుచ్చి నామినేషన్ ప్రక్రియ కొనసాగించాలని సూచించాడు. ముందుగా సరయు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడంటూ యాంకర్ శివను నామినేట్ చేసింది. తర్వాత అషూరెడ్డి.. గేమ్ మీద ఫోకస్ పెట్టడం లేదంటూ మిత్రశర్మను నామినేట్ చేసింది. యాంకర్ శివను నామినేట్ చేస్తూ అతడిపై సెటైర్లు విసిరాడు అఖిల్. ఇంట్లో ఉండాలంటే అర్హత ఉండాలని, నీమీద నీకు నమ్మకం లేకపోతే ఇంట్లో ఉండి వేస్ట్ అని విమర్శించాడు.
తేజస్వి.. అనిల్‌ని నామినేట్‌చేసింది. దీని వల్లనైనా అతనిలోని అసలు గేమ్ బయటకు రాదని తెలిపింది. మహేశ్ విట్టా కూడా తేజు చెప్పిన కారణమే చెప్తూ అనిల్ ఫొటోపై కత్తితో గుచ్చాడు. నటరాజ్ మాస్టర్.. శివను నామినేట్ చేసే క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. మిత్రను హమీదా, శ్రీరాపాకుని అరియానా నామినేట్ చేశారు. ఛాలెంజర్స్ టీమ్.. వారియర్స్‌లో ఇద్దరిద్దర్ని నామినేట్ చేయాలని ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో మొదటగా అఖిల్, అరియానిని ఆర్జే చైతూ, సరయు, నటరాజ్ మాస్టర్‌ని స్రవంతి చొక్కారపు, అరియానా, సరయులను శ్రీరాపాక, సరయు, హమీదలను సరయు నామినేట్ చేశారు.
అనంతరం సరయు, మహేష్ విట్టాలను అజయ్, నటరాజ్ మాస్టర్, సరయులను బిందు మాధవి, ఆషురెడ్డి, హహీదలను మిత్ర శర్మ, సరయు, అఖిల్‌ని యాంకర్ శివ నామినేట్ చేశారు. యాంకర్ శివ సరయును నామినేట్ చేసే క్రమంలో తాను డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడినట్లు నిరూపిస్తే హౌస్‌లో నుంచి వెళ్లిపోతానని సవాలు విసిరాడు. ఇవి సంచలనంగా మారాయి. ఫైనల్‌గా రెండో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన 11 మంది నామినేట్ అయ్యారు. వారిలో సరయు, అఖిల్, హమీదా, అనిల్, మిత్ర శర్మ, అరియానా, యాంకర్ శివ, నటరాజ్, అషూ, శ్రీరాపాక, మహేశ్ విట్టా నామినేట్ అయిన వారిలో ఉన్నారు.