సురభి నాటకాలు ఇకపై ఆన్‌లైన్‌లో.. ప్రపంచ రంగస్థల దినోత్సవ స్పెషల్‌

By Aithagoni RajuFirst Published Mar 27, 2021, 11:55 AM IST
Highlights

 తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ  సౌజన్యంలో బుక్‌ మై షో ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ నిర్వహిస్తుంది. బుక్‌ మై షోతో కలిసి శ్రీ వేంకటేశ్వర సురభి థియేటర్‌ జయచంద్ర వర్మ బృందం 9 సురభి నాటక ప్రదర్శనలు ఇవ్వనున్నాయి.

నాటకాలంటే గుర్తొచ్చేది సురభి నటకాలే. దీనికి అనేక ఏండ్లనాటి చరిత్ర ఉంది. దాదాపు 135ఏళ్లుగా తమ సురభి నాటకాలు ప్రదర్శించబడుతున్నాయి. తాజాగా నాటకాలు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాయి. సాంకేతికతను జోడించుకుని కొత్త రూపుదిద్దుకుంటున్నాయి. డైరెక్ట్ గా నాటకపరిషత్‌ల్లో ప్రదర్శించడమే కాదు ఆన్‌లైన్‌లోకి ఎక్కుతున్నాయి. తాజాగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ  సౌజన్యంలో బుక్‌ మై షో ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ నిర్వహిస్తుంది. 

బుక్‌ మై షోతో కలిసి శ్రీ వేంకటేశ్వర సురభి థియేటర్‌ జయచంద్ర వర్మ బృందం 9 సురభి నాటక ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా బుక్‌ మై షో ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌లో ఈ నెల 27(రేపటి) నుంచి ఏప్రిల్‌ 27 వరకు ప్రతి రోజు రెండు ప్రదర్శలను ఆన్‌లైన్‌లో ప్రసారం చేయనున్నారు. రాత్రి 7గంటలకు, 9 గంటలకు ఈ రెండు నాటకాలు ప్రదర్శిస్తామని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ తెలిపారు. 135సంవత్సరాలు సురభి నాటక చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం అని, ఈ నాటకాలను ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ కొరకు మూడు వీడియో కెమెరాలతో హెచ్‌డీ క్వాలిటీ చిత్రీకరించామని, ఈ నాటక వీడియోలు కేవలం దీనిలో మాత్రమే అందులో ఉంటాయని, ఈ ప్రయోగాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నామని మామిడి హరికృష్ణ తెలిపారు. 
 

click me!