నటుడు `వేదం` నాగయ్య అనారోగ్యంతో కన్నుమూత..

By Aithagoni RajuFirst Published Mar 27, 2021, 11:31 AM IST
Highlights

ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్టు, కష్టాలకు కేరాఫ్‌గా నిలిచే పాత్రల్లో మెప్పించిన `వేదం` నాగయ్య శనివారం కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. కష్టాలు అనుభవించే పెద్ద మనిషి పాత్రల్లో, రైతు తరహా పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్న `వేదం` నాగయ్య దాదాపు మూడు పదుల సినిమాల్లో నటించి మెప్పించాడు.

ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్టు, కష్టాలకు కేరాఫ్‌గా నిలిచే పాత్రల్లో మెప్పించిన `వేదం` నాగయ్య శనివారం కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. కష్టాలు అనుభవించే పెద్ద మనిషి పాత్రల్లో, రైతు తరహా పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్న `వేదం` నాగయ్య దాదాపు మూడు పదుల సినిమాల్లో నటించి మెప్పించాడు.  `వేదం` సినిమాలోని..`నేసేవాడినంటున్నావు కాస్త మంచి బట్టలు కట్టుకొని రావొచ్చు కదా అంటే ఇళ్లు కట్టేవాడికి ఇళ్లుండదు, చెప్పులు కుట్టేవాడికి చెప్పులుండవు.. మాపరిస్థితి కూడా అంతే` అంటూ చెప్పిన డైలాగ్‌తో పాపులర్‌ అయ్యారు వేదంనాగయ్య. 

ఆయన నటించిన పాత్రల మాదిరిగానే నిజ జీవితంలోనూ అనేక కష్టాలు అనుభవించారు వేదం నాగయ్య. గుంటూరు జిల్లా, నర్సరావు పేట సమీపంలోని దేసవరం పేట ఆయన గ్రామం. రెండెకరాలు భూమి ఉండేది. ఊళ్లో పనిలేకపోవడంతో కొడుకు వెంట హైదరాబాద్‌ వచ్చాడు. ఓ రోజు అనుకోకుండా నిర్మాత రాధాకృష్ణ చూసి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఓ పేజ్‌ డైలాగ్‌ని కంఠస్తం పట్టి చెప్పడంతో `వేదం` సినిమాలో అవకాశం దక్కింది. అలా పాపులర్‌ అయిన నాగయ్య తన ఇంటిపేరునే `వేదం` నాగయ్యగా మార్చుకున్నారు.  

`వేదం`, `నాగవల్లి`, `ఒక్కడినే`, `స్టూడెంట్‌ స్టార్`, `ఏమాయ చేశావే`, `రామయ్య వస్తావయ్యా`,` స్పైడర్‌`, `విరంజి` తదితర 25 సినిమాల్లో నటించారు. దాదాపు ఆయన మూడు వేల నుంచి రూ.25వేల వరకు పారితోషికం అందుకున్నారు. కానీ సినిమా అన్నం పెట్టలేకపోయింది. అనారోగ్యంతో ఆయన భార్య ఆ మధ్య కన్నుమూశారు. మరోవైపు సినిమా అవకాశాలు లేక ఆయన బిక్షటన కూడా చేశారు. ఇది తమ దృష్టికి రావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. `మా` అసోసియేషన్‌ వారు నెలకు రూ.2,500 పింఛన్‌ ఇప్పించారు. ఇప్పుడు అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖలు సంతాపం తెలిపారు.
 

click me!