సాయి ధరమ్ తేజ్ కు అవమానం జరిగింది. ఓనెటిజన్ డైరెక్ట్ గా అన్న మాటకు హర్ట్ అయ్యారు మెగా మేనల్లుడు, అంతే కాదు ఆ నెటిజన్ కుదిమ్మతిరిగేలా కౌంటర్ కూడా ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిదంటే..
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తొమ్మిదేళ్లు పూర్తవుతోంది. తనకంటూ సెపరేట్ బ్రాండ్ ను, ఇమేజ్ ను సాధించే పనిలో బిజీగా ఉన్నాడు సాయి తేజ్. సూపర్ హిట్ సినిమాలు చేస్తున్న సాయి తేజ్ లైఫ్ లో కొన్ని ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. అవి యంగ్ హీరోను ఇబ్బంది పెట్టాయి. ఇక సాయి తేజ్ సినిమాలు చేయగలడా అని అనుకున్న టైమ్ లో.. ఫోర్స్ గా కమ్ బ్యాక్ ఇచ్చి.. సూపర్ హిట్ కొట్టాడు సుప్రీం హీరో.
ప్రస్తుతం సాయి తేజ్... గాంజా శంకర్ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈసినిమాతో పాటు..మరికొన్నిసినిమాలు సెట్స్ ఎక్కించబోతున్నాడు మెగా హీరో.. డిఫరెంట్ కాన్సెప్ట్ లు వెతుక్కుంటూ.. సినిమాలు చేస్తున్నాడు సాయి తేజ్. ఏమాత్రం తగ్గకుండా తన సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్లాప్ లు పడకుండా జాగ్రత్త పడుతున్నాడు సాయి తేజ్.
and have given me the utmost satisfaction https://t.co/asD5JU8WtK
— Sai Dharam Tej (@IamSaiDharamTej)ఇక అప్పుడుప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో మాట్లాడుతూ.. తన సినిమాలపై అభిప్రయాలు కూడా తెలుసుకుంటుంటాడు సాయి తేజ్. ఈక్రమంలో సాయి తేజ్ కు తాజాగా ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశాడు సాయి. ఈ సందర్భంగా ఒక నెటిజెన్.. మీ సినిమాలలో మీకు చాలా సంతృప్తిని ఇచ్చిన పాత్రలు ఏమిటని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా చిత్రలహరి, రిపబ్లిక్ సినిమాల్లోని పాత్రలు తనకు చాలా సంతృప్తిని ఇచ్చాయని చెప్పాడు.
Colours swathi : ఇండస్ట్రీపై కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్, అందుకే సినిమాలు మానేసిందట..
అయితే రిపబ్లిక్ స్పెల్లింగ్ రిలబ్లిక్ అని తప్పుగా రాశాడు సాయి తేజ్. అది చూసుకోలేదు. దాంతో చిట్ చాట్ లో ఉన్న మరో నెటిజెన్ సెటైరిక్ గా స్పందించాడు. అది రిలబ్లిక్ కాదురా రిపబ్లిక్... ఎప్పుడైనా స్కూల్ కి వెళ్లావా? అని ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలు సాయి తేజ్ కు కోపం తెప్పించాయి. వెంటనే తేజ్ స్పందిస్తూ... తమ స్కూల్లో తమకు గౌరవం కూడా నేర్పించారని, మీ స్కూల్లో నీకు నేర్పించారా? అని ప్రశ్నించాడు. నేర్పించకపోతే నేర్చుకో అని ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
దాంతో తేజు సమాధానానికి ఆ నెటిజెన్ కూడా స్పందిస్తూ... నన్ను క్షమించు అన్నా... నిజంగా నువ్వు రిప్లై ఇస్తావని అనుకోలేదు. అందుకే అలా పెట్టాను.. వెరీ సారి అంటూ ఆనెటిజన్ రిప్లూ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ చిట్ చాట్ సోషల్ మీడియాలో వైరల్అవుతోంది.