రజినీకాంత్ భార్యపై కోర్టు ఫైర్!

Published : Jul 03, 2018, 03:27 PM IST
రజినీకాంత్ భార్యపై కోర్టు ఫైర్!

సారాంశం

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కొచ్చాడయాన్' సినిమాను దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కొచ్చాడయాన్' సినిమాను దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. రజినీకాంత్ కూతురు సౌందర్యా రజినీకాంత్ రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చింది. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం నిర్మాణ సంస్థ 'మీడియా వన్' యాడ్ బ్యూరో నుండి రూ.10 కోట్లను రుణంగా తీసుకుంది.

దీనికి హామీగా మీడియా వన్ డైరెక్టర్ లతా రజినీకాంత్ సంతకం చేశారు. సినిమా విడుదలైన తరువాత వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పిన మీడియా వన్ సంస్థ కొంత మొత్తం మాత్రమే 
చెల్లించారని మిగిలిన బకాయిల కోసం ప్రయత్నిస్తున్నా.. వారు స్పందించకపోవడంతో యాడ్ బ్యూరో వారు 2016లో సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. డబ్బు ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా.. సినిమా తమిళ హక్కులను ఈరోస్ ఇంటర్నేషనల్ కు రెట్టింపు ధరకు అమ్ముకున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నారు.

దీంతో కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.6.20 కోట్లను యాడ్ బ్యూరోకి చెల్లించాలని ఆదేశించింది. కానీ ఇప్పటివరకు రజినీకాంత్ కుటుంబం ఈ మొత్తాన్ని చెల్లించలేదు. దీంతో ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు మండిపడింది. బకాయిలు ఎందుకు చెల్లించలేదు.. ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?