సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినిమా రీమేక్ లో సూపర్ స్టార్ రజనీ కాంత్..?

By Mahesh Jujjuri  |  First Published Nov 26, 2022, 1:44 PM IST

సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సూపర్ స్టార్ రజనీ కాంత్. ఈ రెండు పేర్లకు కాని.. ఇద్దరికి కాని.. ఎక్కడా లింక్ లేదు. కాని ఇప్పుడు  ఈ ఇద్దరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. సుశాంత్ సింగ్ సినిమాలో  రజనీ కాంత్ నటించబోతున్నారట. ఇంతకీ ఇది ఎలా సాధ్యం. 


సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సూపర్ స్టార్ రజనీ కాంత్. ఈ రెండు పేర్లకు కాని.. ఇద్దరికి కాని.. ఎక్కడా లింక్ లేదు. కాని ఇప్పుడు  ఈ ఇద్దరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. సుశాంత్ సింగ్ సినిమాలో  రజనీ కాంత్ నటించబోతున్నారట. ఇంతకీ ఇది ఎలా సాధ్యం. 

బాలీవుడ్ లో తీపి గురుతులను మిగిల్చి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఆయన వెళ్లిపోయినా.. ఆయన సినిమాలు.. సుశాంత్ మంచితనం మర్చిపోలేనిది. ఇక సౌత్ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌కు తమిళంలో ఎంత క్రేజ్ ఉందో  అందరికి తెలుసు తమిళంతో పాటు తెలుగులోనూ అటు బాలీవుడ్ లోను సూపర్ స్టార్ కు  అంతే క్రేజ్ ఉంది. కోలీవుడ్‌లో ఆయన సినిమాలకు ఎలాంటి సెలబ్రెషన్స్‌ జరుగుతాయో.. టాలీవుడ లో కూడా అంతే  రేంజ్‌లో సెలబ్రెషన్స్‌ జరుగుతాయి. 

Latest Videos

ఇప్పుడు టాపిక్ ఏంటీ అంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్  సినిమా రీమేక్ లో సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించబోతున్నాడట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రజనీ కాంత్ నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వంలో జైలర్‌ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీగా  అంచనాలు కూడా  క్రియేట్‌ చేసింది. 

ఈ సినిమా తర్వాత రజనీ లైకా ప్రొడక్షన్‌ సంస్థలో వరుసగా రెండు సినిమాలు చేయనున్నాడు. అందులో ఒక సినిమాకు డాన్‌ ఫేం శిబి చక్రవర్తి దర్శకత్వం వహించనుండగా, మరొకటి రజనీకాంత్  కుమార్తే ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుంది. దీనికి లాల్ సలాం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాకు సబంధించి ఓ న్యూస్ అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఈమూవీ బాలీవుడ్‌  సినిమాకు రీమేక్‌గా తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన కాయ్‌ పో చే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారట, స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజకీయ అంశాలతో పాటు మతపరమైన వివాదాస్పద సన్నివేశాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ మరో విశేషం ఏంటీ అంటే..  రజనీకాంత్ ఈసినిమాలో  గెస్ట్‌ రోల్‌లో మాత్రమే కనిపించనున్నారట. అతిథి పాత్రే అయినా రజినీ రోల్‌ కథను మలుపు తిప్పేదిగా బలమైన నేపథ్యంతో ఉంటుందని టాక్.  విష్ణు విశాల్, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్  త్వరలో స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇక ఈ సినిమా కథను  తమిళ నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారటని  తమిళ సినీ వార్గాల నుంచి సమాచారం.  అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇక ఈమూవీకి ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం సమకూర్చుతున్నాడు.

click me!