అక్షయ్ కుమార్ పై సంచలన ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్, ముదురుతున్న రిచా వ్యవహారం

Published : Nov 26, 2022, 10:05 AM ISTUpdated : Nov 26, 2022, 10:08 AM IST
అక్షయ్ కుమార్ పై సంచలన ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్, ముదురుతున్న రిచా  వ్యవహారం

సారాంశం

గాల్వాన్ వ్యావహరంలో బాలీవుడ్ నటి రీచా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతంబాలీవుడ్ ను ఈ విషయం కుదిపేస్తుంది. ఒకరితరువాత మరొకరు ఈ విషయంపై స్పందిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఈ వ్యవహరంలో తలదూర్చాడు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. 

గాల్వాన్ వ్యావహరంలో బాలీవుడ్ నటి రీచా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతంబాలీవుడ్ ను ఈ విషయం కుదిపేస్తుంది. ఒకరితరువాత మరొకరు ఈ విషయంపై స్పందిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఈ వ్యవహరంలో తలదూర్చాడు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. 

బాలీవుడ్ లో రీచా వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తోంది. అది కాస్తా బాలీవుడ్ వార్ గా మారే అవకాశం కనిపిస్తోంది. బాలీవుడ్ లో ఈ విషయంపై ఎవరికి వారు ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. ఆ మధ్య ఈ విషయంలో అక్షయ్ కుమార్ స్పందించగా.. ఆయనకు కౌంటర్ గా ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.  

 

మందుగా అక్షయ్ కుమార్ రీచా ట్వీట్ పై స్పందించారు. ఆయన ట్వీట్ చేస్తూ..  అస్సలు ఊహించలేదు  మీరు ఇలా అంటారని.. భారత సైన్యం ఉంది కాబట్టే.. మన ప్రశంతంగా ఉన్నాం అంటూ స్పందించారు. అయితే అక్షయ్ కుమార్ స్పందనపై చాలా మంది డిఫరెంట్ గా కామెంట్ చేస్తున్నారు. కొంత మంది అక్షయ్ కుమర్ అడిగినదాంట్లో నిజం ఉంది అంటూ సపోర్టీవ్ గా మాట్టాడగా..మరికోంత మంది మాత్రం అక్షయ్ ను విమర్షిస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారు. 

 

పాజిటీవ్ పోస్ట్ పెట్టినా..? అక్షయ్ కుమార్ ను మాత్రం వదలడంలేదు ట్రోలర్స్. అక్షయ్ కుమార్ ను కెనడాకుమార్ అంటూ విమర్షిస్తుననారు. ఆయన యాంటీ ఫ్యాన్స్ ఈ పనిచేస్తున్నారనే అనుమానం వ్యాక్తం అవుతోంది. కెనడా సిటిజన్ షిప్ ఉన్న అక్షయ్ కుమార్ ను ఇండియాన్ కాదు అన్నట్టుగా ట్రోల్ చేస్తున్నారు. ఈక్రమంలో అక్షయ్ కుమార్ ట్వీట్ పై   ప్రకాశ్ రాజ్ ఈ విషయంలో స్పందించారు. అక్షయ్ కుమార్ ట్వీట్ పై డిఫరెంట్ గా స్పందించారు. 

మీ నుంచి ఇది ఊహించలేదు. ఊరికే అంటున్నా..మీకంటే కూడా ఇండియన్ సిటిజన్ గా రీచానే ఇక్కడ ఎక్కువ కదా అంటూ.. అక్షయ్ కుమర్ సిటిజన్ షిప్  పై సెటైరికల్ గా  స్పందించారు. అక్షయ్ కంటే కూడా రిచానే ఎక్కువమందికి తెలుసు అన్న కోణంలో ప్రకాశ్ రాజ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

కెనడా  సిటిజన్ షిప్ కలిగి ఉన్న అక్షయ్ కుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 30 ఏళ్లు అయ్యింది. హీరోగా నిర్మాతగా స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు అక్షయ్ కుమార్. ఫిల్మ్ సర్కిల్ లో హైయ్యెస్ట్ టాక్స్ పెయర్ అయిన అక్షయ్ ఎన్నో సేవాకార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అటువంటిది అక్షయ్ ను పట్టుకుని కెనడా కుమార్ అనడం కరెక్ట్ కాదు అంటూ ఆయన ఫ్యన్స్ మండిపడుతున్నారు. అంతే కాదు.. భారత్ కుమార్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌