చంద్రబాబు సీఎం అయితేనే సినిమాలు చేస్తారా?.. నారా రోహిత్‌ రియాక్షన్‌ ఇదే.. పొలిటికల్‌ ఎంట్రీ అప్పుడే?

By Aithagoni Raju  |  First Published Aug 26, 2024, 4:34 PM IST

నారా రోహిత్‌ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటేనే సినిమాలు చేస్తాడా? అనే ప్రశ్నకి స్పందించాడు. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు. పొలిటికల్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. 
 


`సోలో` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత డిఫరెంట్‌ సినిమాలతో మెప్పించాడు. నటుడిగా, హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. అయితే వరుస పరాజయాలు ఆయన్ని వెంటాడాయి. దీంతో ఏకంగా సినిమాలు చేయడమే మానేశాడు రోహిత్‌. ఈ నేపథ్యంలో దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఆడియెన్స్ ముందుకొచ్చాడు. 

ఇటీవల ఏపీ ఎన్నికలకు ముందు `ప్రతినిథి 2` సినిమా చేశాడు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించాడు. దీనికి టీవీ5 మూర్తి దర్శకత్వం వహించడం గమనార్హం. ఈ సినిమా ఘోరంగా పరాజయం చెందింది. ఎన్నికలకు ముందు వచ్చినా, సినిమాని చూసేందుకు ఎవరూ ముందుకురాలేదు. సినిమాలో విషయం లేకపోవడంతో నారా రోహిత్‌, టీవీ5 మూర్తి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అయితే ఈ సినిమా ఆదరణ పొందింది, సీక్వెల్‌ తీస్తారా? అని రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకి నారా రోహిత్‌ స్పందించారు. సినిమా హిట్‌ అంటే ఆయన షాక్‌ అయ్యారు. సినిమా రిలీజ్‌ అయ్యిందా? అనే విషయమే మీరు చెబుతుంటే గుర్తొస్తుందని, దాన్ని అందరం మర్చిపోయాం, మీరు హిట్‌ అంటారేంటి? అని ఆశ్చర్యపోయారు నారా రోహిత్‌. ఆ సినిమా డిజాస్టర్‌ అని తేల్చేశాడు. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయిన సినిమా ఫ్లాప్‌ అని ఆయన తెలపడం విశేషం. 

Latest Videos

undefined

ఇదిలా ఉంటే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే సినిమాలు చేస్తారా? అనే ప్రశ్నకి నారా రోహిత్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాడు. ముందుగానే ప్రభుత్వం మారుతుందని గుర్తించి తనతో సినిమా తీసినందుకు అని తెలిపారు నారా రోహిత్‌. అయితే రీఎంట్రీ ఫిల్మ్ పొలిటికల్‌ కాన్సెప్ట్ తో రావడానికి కారణం చెబుతూ, సీజన్‌ బట్టి, మైండ్‌సెట్‌ని బట్టి వస్తామని, ఆ టైమ్‌లో రాజకీయ వేడి ఉంది, అందుకే ఆ సినిమా చేయాల్సి వచ్చిందని, కానీ అది వర్క్ కాలేదని చెప్పారు నారా రోహిత్‌. 

రాజకీయ ఎంట్రీపై స్పందిస్తూ ప్రస్తుతం సినిమాలు చేయనివ్వండి, ఈ శుక్రవారం సినిమా రిలీజ్‌ అయి హిట్‌ అయితే అదే ఆనందం అని తెలిపారు. రాజకీయాలకు సంబంధించి ఇంకా ఐదేళ్లు ఉంది కదా ఆ తర్వాత చూద్దామని చెబుతూ, 2029 ఉంది కదా అప్పుడు చూద్దామని తెలిపారు. ఎంట్రీ ఇస్తున్నారా? అంటే మీరు చేసేలా చేస్తున్నారని సెటైరికల్‌గా స్పందించాడు నారా రోహిత్‌. ప్రస్తుతం ఆయన `సుందరకాండ` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. డిఫరెంట్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌ ఆకట్టుకుంది. వచ్చే నెలలో సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. 
 

click me!