
సౌత్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఉత్తర భారతదేశ యాత్రలో ఉన్నారు. హిమాలయాలకు వెళ్ళిన సూపర్ స్టార్ అక్కడి నుంచి బద్రినాధ్.. అక్కడి నుంచి జార్ఖాండ్ ఆశ్రమానికి, అక్కడి నుంచి ఉత్తరాఖండ్, అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్, అయోధ్య ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తూ వస్తున్నారు. ఇక లక్నోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ ను కలవడంతో పాటు.. సాధువు అయిన ఆఞన కాళ్లు మెక్కారు. ఈవిషయం వివాదం కూడా అయ్యింది. ఆతరువాత యూపీ ప్రముఖ రాజకీయ నేత అఖిలేష్ యాదవ్ ను కూడా కలుసుకున్నారు రజినీకాంత్.
ఇక తాజాగా ఆయన అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ హనుమంతుడిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రజినీకాంత్ నుదుట తిలకం దిద్ది, ఆయన మెడలో గులాబీల మాల వేశారు. పూజల అనంతరం ఆయన ఆలయం బయటికి వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు.
హనుమాన్ గర్హి ఆలయంలో హనుమంతుడిని దర్శనం చేసుకోవడం తన అదృష్టమని, తాను చాలా అదృష్టవంతుడినని రజినీకాంత్ వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడూ హనుమాన్ గర్హికి వచ్చి హనుమంతుడిని దర్శించుకోవాలని కోరుకుంటూ ఉంటానని రజినీ తెలిపారు. అంతకుముందు రజినీకాంత్ ఉత్తరప్రదేశ్ లోని పలువురు ప్రముఖులను కలుసుకున్నారు. తన ప్రతీ సినిమా రిలీజ్ కు ముందు హియాలయాలకు వెళ్లడం సహజం. కరోనా వల్ల రెండుమూడేళ్లు ఆయన హిమాలయాలకు వెళ్ళలేదు. ఇక తాజాగా జైలర్ రిలీజ్ కు ముందు ఆయన హిమాలయాలకు వెళ్ళారు.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. జైలర్ రిలీజ్ అయ్యి 10 రోజులు అవ్వగా..దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది మూవీ. ఈసినిమాలో రజనీకాంత్ తో పాటు.. రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునిల్ లాంటి స్టార్స్ నటించారు. ఈమూవీ ప్రభంజనం సౌత్ స్టేట్స్ లో కొనసాగుతోంది. కన్నడలో 50 కోట్లు.. తెలుగులో 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది మూవీ.