సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ విషయంలో భయపడుతారో తెలుసా...?

By Mahesh Jujjuri  |  First Published Aug 23, 2024, 9:17 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో పాన్ వరల్డ్ స్టార్ గా మారబోతున్నారు. రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. అమెజాన్ అడ్వెంచర్ కు రెడీ అవుతున్నారు. 

Superstar Mahesh Babu Surprising Fear: What Scares the Pan World Star JMS

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండు మూడు రకాల లుక్ టెస్ట్ జరిగాయట మహేష్ కు. అయితే ఫైనల్ లుక్ మాత్రం ఇంత వరకూ కన్ ఫార్మ్ కాలేదు. త్వరలో ఈమూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈమూవీ ఓపెనింగ్ కు డేట్ ను కూడా ఇంకా ఫైనల్ చేయలేదు. 

మహేష్ బాబు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.మహేష్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ గా ఎదరు చూస్తూ ఉన్నారు. ఇక త్వరలో ఈ మూవీషూటింగ్ కు రెడీ అవుతున్నారు. కాగా మహేష్ బాబు నుంచి సినిమా రావడానికి ఇంకా మూడు నాలుగేళ్ళు పట్టవచ్చు అని తెలియడంతో ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. అయితే మహేష్పాన్ వరల్డ్ స్టార్ అవ్వబోతున్నాడు అని తెలియడంతో దిల్ ఖుష్ అవుతున్నారు. 

Latest Videos

ఈక్రమంలో మహేష్ బాబుకు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు.. స్టార్ హీరోగా ఎన్నో అడ్వెంచర్లు చేసి ఉంటాడు..అయితే ఆయన ఏ విషయంలో.. భయపడతారో మీకు తెలుసా..? సోషల్ మీడియా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఓ విషయంలో కాస్త వెనకడుకు వేస్తారట. అదేదో కాదు.. వాటర్.. అవును వాటర్ కు సబంధించి మహేష్ లో ఓ చిన్న భయం ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. 

బాగా ఎత్తైన జలపాతాలు.. నిండు గా ఉన్న సరస్సులు, నదులు.. ఇలా నీటికి సబంధించి మహేష్ బాబుకు భయం ఉందని. అందుకే ఎక్కువగా అలాంటి ప్రాంతాల్లో షూటింగ్ పెట్టుకోవద్దు అని దర్శకులకు మహేష్ చెపుతాడు అని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. చాలామంది ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. ఇటువంటి ప్రచారాల్లో ఏ నిజం లేదు అంటున్నారు. 

మహేష్ బాబు ఇప్పటికే నీటికి సబంధించి చాలా సన్నివేశాలు చేశారు. నీళ్ళల్లో డాన్స్ లు కూడా వేసిన పాటలు ఉన్నాయి. అంతే కాదు ఆయన ఇంట్లో కూడా పెద్ద స్విమ్మింగ్ ఫూల్ ఉండటం.. అందులో తన పిల్లలతో కలిసి ఆయన ఈత కొట్టడం కూడా అందరికి తెలిసిందే. మరి అలాంటప్పుడు ఇలా మహేష్ కు ఎందుకు నీరు అంటే ఫోబియా ఉంటుంది అని తిట్టిపోస్తున్నారు. 

vuukle one pixel image
click me!
vuukle one pixel image vuukle one pixel image