శ్రీరాముడి పాత్రకి మహేష్ బాబు కంటే పర్ఫెక్ట్ గా ఇంకెవరూ సెట్ అవ్వరు..స్టార్ కాస్టింగ్ డైరెక్టర్ కామెంట్స్

By tirumala AN  |  First Published Aug 23, 2024, 5:31 PM IST

బాలీవుడ్ లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా రామాయణ చిత్రం తెరకెక్కుతోంది. సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది. అయితే ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చబ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఇటీవల ఇండియన్ స్క్రీన్ పై పౌరాణిక కథలకి  సంబంధించిన చిత్రాలు బాగా వర్కౌట్ అవుతున్నాయి. ఇటీవల కల్కి చిత్రంలో ప్రభాస్ కర్ణుడిగా కనిపించి గూస్ బంప్స్ తెప్పించారు. హను మాన్ చిత్రం ఆంజనేయ స్వామి బ్యాక్ డ్రాప్ తో వచ్చి అదరగొట్టింది. కార్తికేయ 2 శ్రీకృష్ణుడి నేపథ్యంలో తెరకెక్కి పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. 

ప్రస్తుతం బాలీవుడ్ లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా రామాయణ చిత్రం తెరకెక్కుతోంది. సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది. అయితే ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చబ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడి పాత్రకు ఎవరు బాగా సెట్ అవుతారు అనే ప్రశ్న ముకేశ్ కి ఎదురైంది. 

Latest Videos

శ్రీరాముడి పాత్రలో కనిపించాలి అంటే చార్మింగ్ లుక్స్ ఉండాలి. చిరునవ్వుతోనే అందరి ప్రేమని పొందగలగాలి. అలాంటి లక్షణాలు నాకు తెలిసిన నటుల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి మాత్రమే ఉన్నాయి. రాముడి పాత్రకి మహేష్ బాబు పర్ఫెక్ట్ ఛాయిస్ అని ముకేశ్ చబ్రా అన్నారు. 

బాలీవుడ్ ముకేశ్ చబ్రా ఎంత ఫేమస్ కాస్టింగ్ డైరెక్టరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి వ్యక్తి మహేష్ బాబు శ్రీరాముడిగా నటించాలి అని చెబితే అది గొప్ప విషయమే. 

click me!