షూటింగ్స్ కు దూరంగా రవితేజ, మాస్ మహారాజ్ కు ఏమయ్యింది..?

By Mahesh Jujjuri  |  First Published Aug 23, 2024, 7:35 PM IST

మాస్ మహారాజ్ రవితేజ కొంత కాలం సినిమా షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వబోతున్నారు. ఇంటికే పరిమితం కాబోతున్నారు ఇంతకీ ఆయన ఎందు ఈ గ్యాప్ తీసుకుంటున్నారో తెలుసా..? 
 
 



టాలీవుడ్ స్టార్ హీరో మాస్ హీరో రవితేజకు గాయం అయినట్టు తెలుస్తోంది. షూటింగ్ టైమ్ లో ప్రమాదం జరిగి  ఆయన కుడి చేతికి గాయం అయ్యిందని సమాచారం. ప్రస్తుతం రవితేజ భాను దర్శకత్వంలో 75వ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఇక గాయం ఎక్కువ అవ్వడంతో ఆయనకు హైదరాబాద్ యశోదా హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగినట్టు రవితేజ పీఆర్ టీమ్ నుంచి సమాచారం. 

అయితే రవితేజకు ఈ గాయం ఇంతకు ముందే అయ్యిందట. ఈసినిమా షూటింగ్ లో కుడిచేతి నరానికి దెబ్బ తగలడంతో.. రవితేజ ఆ గాయన్ని లెక్క చేయకుండా.. నిర్మాత నష్టపోకుండా షూటింగ్ కు హాజరవుతూ వస్తున్నారు. అయితే రాను రాను గాయం పెద్దది అవ్వడం... ప్రమాదం పొంచి ఉండటంతో ఆయనకు శస్త్రచికిత్స చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు రవితేజ  కొన్ని రోజుల పాటు షూటింగ్స్ కు దూరంగా ఉండాల్సిదేనని తెలుస్తోంది. 

Latest Videos

రవితేజకు ఆపరేషన్ తరువాత దాదాపు ఆరు వారాల పాటు విశ్రాంతి  తీసుకోవలసిందిగా డాక్టర్స్ సూచించారట. దాంతో రవితేజ షూటింగ్ కు బ్రేక్ ఇవ్వక తప్పని పరిస్థితి. నెలకు పైనే రవితేజ్ ఇంట్లో రెస్ట్ తీసుకోబోతున్నారు. షూటింగ్ షెడ్యూల్స్ ను చేంజ్ చేయబోతున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మాస్ మహారాజ్. గెలుపోటములు లెక్క చేయకుండా వరుస సినిమాలు చేస్తున్నారు రవితేజ 

అయితే సక్సెస్ మాత్రం రవితేజతో దోంగాట ఆడుతోంది. ఒకటీరెండు సినిమాలు హిట్టు పడగానే.. మరో రెండు సినిమాలు ప్లాప్ బాట పడుతున్నాయి. రామారావు ఆన్ డ్యూటీ, ఖిలాడీ, రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావు, ఈగల్ అంటూ ఇలా ఏ సినిమా కూడా కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయాయి. దాంతో ఆయన వాటిని పట్టించుకోకుండా.. తన సినిమాలు తాను చేసుకుంటూ పోతున్నాడు. 60 ఏళ్ళకు అతి దగ్గరలో ఉన్న రవితేజ..ఇప్పటికీ అదే జోష్ తో.. అదేఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తూ.. టాలీవుడ్ లో సందడి చేస్తున్నాడు. 

మిస్టర్ బచ్చన్ సినిమాతో గత వారమే ఆడియెన్స్ ముందుకు వచ్చాడు రవితేజ. మిస్టర్ బచ్చన్ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందో అందరికి తెలిసిందే.. .. ఈసినిమా కోసం రవితేజ్ ఎంత కష్టపడ్డా..  దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం  విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 

click me!