రామ్ చరణ్ కూతురు క్లింకారతో అల్లు అర్జున్ కూతురు అర్హ డాన్స్.. ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో!

Published : Jan 16, 2024, 05:26 PM IST
రామ్ చరణ్ కూతురు క్లింకారతో అల్లు అర్జున్ కూతురు అర్హ డాన్స్.. ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో!

సారాంశం

సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ కూతురు కు సంబంధించిన క్యూట్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. చిన్నారుల సంతోషాన్ని చూసిన నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. 

మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక్క చోట చేరిన సంగతి తెలిసిందే. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun, రామ్ చరణ్ Ram Charan  కుటుంబం ఇటీవల తరుచుగా కలుస్తున్నారు. పండుగల సందర్భంగా ఫ్యామిలీ మొత్తం కలిసిపోతోంది. ఈ సందర్భంగా Sankranthi 2024ని మెగా, అల్లు ఫ్యామిలీ కలిసి సెలబ్రేట్ చేసుకుంది. మెగా ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. 

ఇప్పటికే ఫ్యామిలీ ఫొటోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ సంతానం అకిరా నందన్, ఆద్య కనిపించి మెగా అభిమానులను ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలో మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్ నుంచి మరో వీడియో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా Allu Arha, రామ్ చరణ్ కూతురు క్లింకార Klinkaara కు సంబంధించిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

ఆ వీడియోలో అల్లు అర్హ.. అత్త ఉపాసన కొణిదెల Upasana Konidela, మెగా ప్రిన్సెస్ క్లింకారతో ఆడుతూ కనిపించింది. క్లింకార చిట్టిచిట్టి పాదాలను పట్టుకొని డాన్స్ చేస్తూ కనిపించింది. ఆ వీడియో కు ఉపాసన ‘పుష్ప’ సినిమాలోని ‘శ్రీవల్లి’ ప్యాట్ ను జతచేసింది. దీంతో అల్లు అర్హ క్లింకారను శ్రీవల్లిగా కీర్తిస్తున్నట్టుగా వీడియోను వదిలారు. ఏదేమైనా అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యామిలీ సంతోషంగా కలిసి ఉండటం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తోంది. 

ఇక అల్లు అర్జున్ నెక్ట్స్ ‘పుష్ప2’ Pushpa 2లో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్. 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు రామ్ చరణ్ - శంకర్ కాంబోలో ‘గేమ్ ఛేంజర్’ Game Changer మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..