గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ లో ఫ్యాన్స్ రచ్చ.. తొక్కిసలాటలో పలువురికి గాయాలు..

Published : Jan 09, 2024, 08:20 PM ISTUpdated : Jan 09, 2024, 08:55 PM IST
గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ లో ఫ్యాన్స్ రచ్చ.. తొక్కిసలాటలో పలువురికి గాయాలు..

సారాంశం

గుంటూరులోని నంబూరులో గుంటూరు కారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ ఈవెంట్లో తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలు అయ్యాయి.   

గుంటూరు జిల్లా నంబూరులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించి గుంటూరు కారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ తో పాటు.. హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లాంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇంత మంది సెలబ్రిటీలు రావడంతో జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు.ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ రెండు రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. దాంతో ఫ్యన్స్ ను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల అవ్వలేదు.  జరుగుతున్న గుంటూరు కారం ప్రీ లాంచ్ రిలీజ్ లో భారీగా తొక్కిసలాట.

మహేష్ ఫ్యాన్స్ చేసిన రచ్చ వల్ల.. గోల వల్ల మహిళలు ఇబ్బందులుపడవలసి వచ్చింది. ఇంత జరిగినా..  నిర్వాహకులు పట్టించుకోకుండా  నిర్లక్ష్యం గా వ్యవహరించడంతో .. అభిమానులు  తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక దశలో అభిమానులను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. దాంతో పలువురికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. 

 

సుమారు 5 వేల మందికి  మాత్రమే ఏర్పాట్లు జరగ్గా.. అందుకు భిన్నంగా 15 వేల మందిని యాజమాన్యం అనుమతించడం వల్లే ఇలా జరిగిందంటూ  పోలీసులు అంటున్నారు. అభిమానుల తాకిడి తట్టుకోలేక లాఠీ ఛార్జీ చేసిననట్టు  పోలీసులు అంటున్నారు. నిర్వాహకులు పోలీసుల మద్య కమ్యూనికేషన్ లేకపోవడంతో.. అక్కడ ఈ పరిస్థితి ఉన్నట్టు సమాచారం. నిర్వహకులు పట్టించుకోకపోవడంతో పోలీసులు కూడా అంతా తమ చేతుల్లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ రచ్చవల్ల తీవ్ర ఇబ్బందులకు గురైన అభిమానులు కార్యక్రమం స్టార్ట్ కాకముందే తిరిగి వెళ్ళిపోతున్నారు. 

ఇక త్రివ్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా లో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మరో హీరోయిన్ గా మీనాక్షీ నటించగా.. తమన్ ఈసినిమాకు స్వరాలుసమకూర్చారు. ఈసంక్రాంతి కానుకగా ఈనెల 12న గుంటూరు కారం సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. 

PREV
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు