‘గుంటూరు కారం’కి ప్రభుత్వం గుడ్ న్యూస్.. బెనిఫిట్ షోలకు అనుమతి, టికెట్ రేట్లు పెంపు

By Nuthi SrikanthFirst Published Jan 9, 2024, 6:26 PM IST
Highlights

మహేశ్ బాబు - త్రివిక్రమ్ సినిమా ‘గుంటూరు కారం’ Guntur Kaaram విడుదలకు రెండురోజులే సమయం ఉంది. ఈ  క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మేకర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. 

సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ Trivikram కాంబోలో రిలీజ్ కాబోతున్న చిత్రం ‘గుంటూరు కారం’. రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతోంది. అటు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాను విజయవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘గుంటూరుకారం’ చిత్ర నిర్మాణ సంస్థకు గుడ్ న్యూస్ చెప్పింది.

సినిమాను స్పెషల్ షోస్, బెనిఫిట్ షోలుగా ప్రదర్శించుకునేందుకు అనుమతిని ఇచ్చింది. ఈమేరకు ఆర్డర్ కాపీని కూడా రిలీజ్ చేసింది. అందులో ఉన్న వివరాల ప్రకారం... ఈనెల 12 నుంచి 18 వరకు ‘గుంటూరు కారం’ రిలీజ్ అవుతున్న అన్ని థియేటర్లలో ఆరో షో ఉదయం 4 గంటలకు ప్రదర్శించేందుకు అనుమతిని పొందింది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  రిలీజ్ రోజున (జనవరి 12)న 23 థియేటర్లలో బెనిఫిట్ షోలకు కూడా అనుమతిని ఇచ్చింది. ఆ థియేటర్ల వివరాలను తెలియజేసింది. 

Latest Videos

అలాగే ‘గుంటూరు కారం’ టికెట్ రేట్లనూ పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్ లో ఈ మూవీ టికెట్స్ ప్రైజ్ ను రూ.65కు, మల్టీ ప్లెక్స్ ల్లో రూ.100కు పెంచింది. దీంతో సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధర రూ.250, మల్టీప్లెక్స్ ల్లో రూ.410గా ఉంది.  మొత్తానికి చిత్రానికి సంబంధించిన రిలీజ్ విషయంలో అన్నీ ఏర్పాట్లు పూర్తవడంతో ఫ్యాన్స్, ఆడియెన్స్ సినిమాను చూసి ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 

ఇక  Guntur Kaaram Pre Release Event వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం.. గుంటూరులోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో గల నంబూరు ఎక్స్ రోడ్స్ వద్ద ఉన్న ఓపెన్ ప్లేస్ లో ఈవెంట్ కు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మహేశ్ బాబు, త్రివిక్రమ్, దిల్ రాజ్, నాగవంశీ, శ్రీలీలా, మీనాక్షి చౌదరి ఈవెంట్ కోసమని గుంటూరుకు బయల్దేరారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

click me!