ఫ్యాన్స్ ని డిజప్పాయింట్‌ చేసిన మహేష్‌.. సూపర్‌ స్టార్‌ బర్త్ డేకి నో ట్రీట్‌

Published : May 27, 2021, 04:31 PM IST
ఫ్యాన్స్ ని డిజప్పాయింట్‌ చేసిన మహేష్‌.. సూపర్‌ స్టార్‌ బర్త్ డేకి నో ట్రీట్‌

సారాంశం

కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్‌ నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రంలోని ఫస్ట్ లుక్‌ వస్తుందని అంతా భావించారు. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా `సర్కారువారి పాట` నుంచి ఎలాంటి అప్‌డేట్‌ని ఇవ్వడం లేదని మహేశ్‌బాబు టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

కరోనా అందరికి నిరాశనే మిగుల్చుతుంది. తాజాగా మహేష్‌ ఫ్యాన్స్ కి కూడా నిరాశ తప్పడం లేదు. ఈ నెల 31న సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు. తన తండ్రి బర్త్ డే సందర్భంగా మహేష్‌ నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రంలోని ఫస్ట్ లుక్‌ వస్తుందని అంతా భావించారు. ఆ వార్తలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ సినిమాలో మహేష్‌ని ఓ కొత్త లుక్‌లో చూడొచ్చని ఆతృతగా వెయిట్‌ చేస్తున్నారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లింది మహేష్‌ టీమ్‌. 

 ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా `సర్కారువారి పాట` నుంచి ఎలాంటి అప్‌డేట్‌ని ఇవ్వడం లేదని మహేశ్‌బాబు టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. `దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని `సర్కారు వారి పాట` సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని చిత్రబృందం భావించింది. సినిమా అప్‌డేట్‌ గురించి ఎవరూ కూడా అనధికారికంగా, అవాస్తవాలను దయచేసి సృష్టించవద్దు. సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్‌నైనా అధికారిక ఖాతాల్లో తప్పకుండా పోస్ట్‌ చేస్తాం. అప్పటివరకూ దయచేసి జాగ్రత్తగా ఉండండి. సురక్షితంగా ఉండండి` అని మహేశ్‌ టీమ్‌ ట్వీట్‌ చేసింది. 

మహేష్‌ హీరోగా కీర్తిసురేష్‌ కథానాయికగా `సర్కారువారి పాట` సినిమా రూపొందుతుంది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇదిలా ఉంటే మహేష్‌ నెక్ట్స్ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న ప్రారంభిస్తారని తెలుస్తుంది. మరి ఇదైనా జరుగుతుందా? లేక వాయిదా పడుతుందా? అన్నది చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?