ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి మళ్లీ నిరాశ తప్పదా? `ఎవరు మీలో కోటీశ్వరులు` లేనట్టేనా?

Published : May 27, 2021, 03:31 PM IST
ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి  మళ్లీ నిరాశ తప్పదా? `ఎవరు మీలో కోటీశ్వరులు` లేనట్టేనా?

సారాంశం

`ఎవరు మీలో కోటీశ్వరులు` షో మే నెలలో ప్రారంభమవుతుందన్నారు. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించడంతో షా వాయిదా పడింది. షూటింగ్‌లన్నీ నిలిచిపోవడం, లాక్‌డౌన్‌ వంటవన్నీ ఈ షోపై ప్రభావాన్ని చూపాయి. 

ఎన్టీఆర్‌ హోస్ట్ గా `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షో ప్రసారం కానున్న విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం ఈ షోని అధికారికంగా ప్రకటించారు. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ఆడిషన్స్ కూడా దాదాపు పూర్తయ్యింది. మే నెలలో షో ప్రారంభమవుతుందన్నారు. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించడంతో షా వాయిదా పడింది. షూటింగ్‌లన్నీ నిలిచిపోవడం, లాక్‌డౌన్‌ వంటవన్నీ ఈ షోపై ప్రభావాన్ని చూపాయి. 

అయితే ఈ షో జూన్‌లో ప్రారంభమయ్యే ఛాన్స్‌ ఉందనే టాక్‌ వినిపించింది. తాజాగా ఎన్టీఆర్‌ తన ఫ్యాన్స్ కి మరోసారి షాక్‌ ఇచ్చారు. ఈ షో ఇప్పట్లో ప్రారంభమయ్యే ఛాన్స్ లేదని చెబుతున్నారు. నిజానికి ఎన్టీఆర్‌ని చూడక మూడేళ్లవుతుంది. చివరగా ఆయన `అరవింద సమేత`లో నటించారు. ఆ తర్వాత `ఆర్‌ఆర్‌ఆర్‌`లో లాక్‌ అయ్యారు. ఆ సినిమా రావడానికి అక్టోబర్‌ వరకు వెయిట్‌ చేయాలి. ఆ లోపు `ఎవరు మీలో కోటీశ్వరుడు` షోతోనైనా ఎన్టీఆర్‌ని చూడొచ్చు అనుకున్నారు. కానీ వారి ఆశలపై కరోనా నీళ్లు చల్లుతూనే వస్తుంది. 

తాజాగా సమాచారం మేరకు ఈ షోని ఆగస్ట్ వరకు వాయిదా వేసినట్టు టాక్‌. ఆ సమయానికి కరోనా ఉధృతి తగ్గే అవకాశం ఉందని, ఆ టైమ్‌లో షోని రన్‌ చేసుకోవచ్చు అని నిర్వహాకులు భావిస్తున్నారు. ఒకవేళ ఆ టైమ్‌కి కూడా సాధ్యం కాకపోతే, కరోనా తగ్గకపోతే ఈ ఏడాది మొత్తం షోని నిర్వహించకూడదనే సెకండ్‌ థాట్‌లో కూడా నిర్వహకులు ఉన్నారని  టాక్‌. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ మాత్రం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కిది, `ఎవరు మీలో కోటీశ్వరులు` అభిమానులకు నిరాశ తప్పదనే అంటున్నారు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్నారు. త్వరలో కొరటాల శివతో సినిమాని ప్రారంభించబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?