తలైవా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రజినీకాంత్ మూవీ

By Mahesh JujjuriFirst Published Nov 24, 2023, 12:16 PM IST
Highlights

గెట్ రెడీ సూపర్ స్టార్ ఫ్యాన్స్.. తలైవా సూపర్ హిట్ మూవీ శివాజీ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. రీరిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసి.. పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే..? 
 

ప్రస్తుతం టాలీవుడ్  ఫిల్మ్ ఇండస్ట్రీలో  రీ రిలీజ్ ల ట్రెండ్ జోరుగా సాగుతోంది. స్టార్ హీరోల సినిమాలను ఆయా అకేషన్లను బట్టి రీరిలీజ్ కు ముస్తాబు చేస్తున్నారు మేకర్స్. స్టార్ హీరోల కెరీర్ లో నిలిచిపోయిన సినిమాలు.. హిట్ అయినా.. ప్లాన్ అయినా సరే అభిమానులు మర్చిపోలేని సినిమాలను ఏరి కోరి రీరిలీజ్ చేస్తుంటారు.  ఇలా హీరోలు పుట్టినరోజు సందర్భంగా వారి కెరియర్లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటు వంటి సినిమాలను తిరిగి 4కె వెర్షన్లు విడుదల చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 

ఇప్పటికీ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా  స్టార్ హీరోల సినిమాలు చాలా వరకూ రీరిలీజ్ ట్రెండ్ ను ఫాలో అయ్యి..సక్సెస్ అయ్యాయి. మేకర్స్ కు మరోసారి లాభాలు తెచ్చిపెట్టాయి. ఇక కోలీవుడ్ హీరోల సినిమాలను కూడా టాలీవుడ్ లో రీరిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శ్రియా శరణ్ హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ శివాజీ ది బాస్. 2007 లో మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకున్న ఈ మూవీలో సుమన్ విలన్ పాత్రలో కనిపించారు.

Latest Videos

అప్పట్లోనే దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినటువంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు భాషలలోనూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని సుమారు 160 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రజనీకాంత్ సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా త్వరలోనే రీ రిలీజ్ చేయబోతున్నారని తెలిసి.. మూవీపూ అంచనాలు భారీగా పెరిగాయాయి. 4కెలో ఈ సినిమాను చూడటానికి ఆడియన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.  ఈ ఏడాది డిసెంబర్ 12న సూపర్ స్టార్ బర్త్ డే కావడంతో.. ఆ అకేషన్ ను సెలబ్రేట్ చేస్తూ..  మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు టీమ్. 

 

రజనీకాంత్  బర్త్ డే డిసెంబర్ 12 న కాగా.. దానికి మూడు రోజులు ముందుగానే శివాజీ రీ రిలీజ్ ఉండే అవకాశం ఉంది. రీరిలీజ్ తరువాత కూడా ఈమూవీ భారీగా కలెక్ట్ చేస్తుందన్ననమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఎందుకుంటే యావరేజ్ టాక్ తోనే భారీ కలెక్షన్స్ సాధించింది సినిమా.. రీరిలీజ్ తో ఎన్ని రికార్డ్ లు బ్రేక్ చేస్తుందో చూడాలి. 

click me!