'లియో' నిర్మాత తనయుడి రిసెప్షన్ వేడుకలో దళపతి విజయ్ సందడి..ఎంత సింపుల్ గా వచ్చాడో చూడండి, పిక్స్ వైరల్

By Asianet News  |  First Published Nov 24, 2023, 11:56 AM IST

తాజాగా విజయ్.. లియో నిర్మాత లలిత్ కుమార్ తనయుడి వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరయ్యారు. నవంబర్ 23న చెన్నైలో వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది.


ఇలయదళపతి విజయ్ జోరు ప్రస్తుతం మామూలుగా లేదు. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ రేంజ్ వసూళ్లు వస్తున్నాయి. తమిళనాడులో విజయ్ అభిమానులకు ఆరాధ్య నటుడిగా మారిపోయారు. విజయ్ నటించిన చివరి చిత్రం లియోకి పర్వాలేదనిపించే టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ అదిరిపోయాయి. 

Latest Videos

లియో హంగామా ముగియడంతో విజయ్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ చేశారు. విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దళపతి 68(వర్కింగ్ టైటిల్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే విజయ్ కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుని థాయిలాండ్ నుంచి తిరిగి వచ్చారు. 

తాజాగా విజయ్.. లియో నిర్మాత లలిత్ కుమార్ తనయుడి వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరయ్యారు. నవంబర్ 23న చెన్నైలో వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. రిసెప్షన్ వేడుకకి విజయ్ తన మేనేజర్ జగదీష్ పళనిస్వామి, విజయ్ మక్కళ్ ల్యాక్కం జనరల్ సెక్రటరీ ఆనంద్ తో కలసి వెళ్లారు. 

రిసెప్షన్ వేడుకకు విజయ్ చాలా సింపుల్ గా వైట్ షర్ట్ లో మెరిశారు. విజయ్ రాకతో రిసెప్షన్ వేడుక జరుగుతున్న వేదిక చాలా కోలాహలంగా మారింది. వధూవరులకు విజయ్ ఫ్లవర్ బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ వస్తున్నప్పుడు అభిమానులు కేరింతలు కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ ఆ మారాయి. 

 

Good Morning 🤍❤️🫶 pic.twitter.com/or3xv9f5A8

— 𝐑𝚰𝐘𝐀 (@RiyashaTweets)

రిసెప్షన్ కి సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ కూడా హాజరయ్యారు. లియో, జైలర్ లాంటి హిట్ చిత్రాలతో అనిరుద్ కూడా టాప్ ఫామ్ లో ఉన్నాడు. దళపతి విజయ్ ఇలా ఫంక్షన్స్ కి చాలా అరుదుగా హాజరవుతుంటారు. లియో విషయానికి వస్తే లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. త్రిష ఫిమేల్ లీడ్ గా నటించింది. అర్జున్, సంజయ్ దత్ విలన్స్ గా నటించగా.. దర్శకుడు గౌతమ్ మీనన్ కీలక పాత్రలో నటించారు.  

's Bond with his fans ❤️🥹.. Man never fails to respond to his Nanbas & Nanbis 👏💥 pic.twitter.com/bNxUJzw7Mx

— VCD (@VCDtweets)
click me!