వింటేజ్ రజనికాంత్ ఈజ్ బ్యాక్.. కిక్కిస్తున్న 'అన్నాత్తే' ఫస్ట్ లుక్

pratap reddy   | Asianet News
Published : Sep 10, 2021, 02:36 PM IST
వింటేజ్ రజనికాంత్ ఈజ్ బ్యాక్.. కిక్కిస్తున్న 'అన్నాత్తే' ఫస్ట్ లుక్

సారాంశం

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తే. మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తే. మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వినాయక చవితి సందర్భంగా చిత్ర యూనిట్ నేడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. 

సాధారణంగానే రజిని నిలబడితే స్టైల్ గా ఉంటుంది. ఆయన నడిచినా స్టయిలే. రజనీని ఆరాధ్య దైవంగా భావించే అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పాలి. 

రజనీకాంత్ ని ఈ లుక్ లో చూస్తుంటే ఆయన వయసు పాతికేళ్ళు తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. వింటేజ్ రజినీ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పంచె కట్టులో, గాగుల్స్ ధరించిన రజనీకాంత్ యమా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. 

రజిని ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ అంశాలతో పాటు, కుటుంబ సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో హైలైట్ గా నిలవనున్నాయి. ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్ తో పాటు సీనియర్ హీరోయిన్లు ఖుష్బూ, మీనా కూడా నటిస్తున్నారు. నవంబర్ లో ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. దర్శకుడు శివ వరుస విజయాలతో దూసుకుపోతుండంతో రజని అభిమానులు ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుని ఉన్నారు.

 

PREV
click me!

Recommended Stories

Deepika Pregnancy: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన దీపికా, రణ్‌వీర్ సింగ్.. కూతురితో కలిసి స్వీట్ సర్‌ప్రైజ్!
మ‌న‌సును క‌దిలించే అంద‌మైన ప్రేమ క‌థ‌.. నిజంగా ప్రేమ ఇంత గొప్పదా.? చ‌ల్ల‌టి వ‌ర్షంలాంటి మూవీ