వివాదంలో కంగనా ‘తలైవి’చిత్రం..!

Published : Sep 10, 2021, 07:45 AM IST
వివాదంలో కంగనా ‘తలైవి’చిత్రం..!

సారాంశం

సంస్థకు సంబంధించిన బ్యాంకు ఖాతా జూబ్లీహిల్స్ లోని యాక్సిస్ బ్యాంకులో ఉంది. ఇందూరి విష్ణువర్థన్ తరపున ఒకరు, పవన్ కుమార్ బట్టాడ్ తరపున ఒకరు సంయుక్త ఖాతాదారులుగా లావాదేవీలు నిర్వహించేలా ఒప్పందం చేస్తున్నారు.

తమ ప్రమేయం లేకుండా సంస్థ నిధులను భాగస్వాములు వారి సొంత సంస్థ ద్వారా తలైవి చిత్రానికి మళ్లించారంటూ విబ్రీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ కార్తిక్ కృష్ణన్ బంజారాహిల్స్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై పొడిశెట్టి రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో విబ్రి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం ఉంది.

ఈ సంస్థలో ఇందరూ విష్ణువర్థన్, అతని భార్య బ్రిందా ప్రసాద్ తో పాటు పవన్ కుమార్ బట్టాడ్, కార్తీక్ కృష్ణన్ లు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. సంస్థకు సంబంధించిన బ్యాంకు ఖాతా జూబ్లీహిల్స్ లోని యాక్సిస్ బ్యాంకులో ఉంది. ఇందూరి విష్ణువర్థన్ తరపున ఒకరు, పవన్ కుమార్ బట్టాడ్ తరపున ఒకరు సంయుక్త ఖాతాదారులుగా లావాదేవీలు నిర్వహించేలా ఒప్పందం చేస్తున్నారు.

అయితే.. తమకు ఎలాంటి సమాచారం లేకుండా విష్ణువర్థన్ , బ్రిందా ప్రసాద్ గతేడాది ఫిబ్రవరిలో రూ.75లక్షలను విబ్రి మోషన్ పిక్చర్స్ అనే సొంత సంస్థకు రెండు దఫాలుగా ఆన్ లైన్ ద్వారా మళ్లించుకున్నారని కార్తిక్ కృష్ణన్ ఫిర్యాదు చేశారు.

ఆ డబ్బు మొత్తాన్ని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత కథాంశాన్ని ఆధారంగా చేసుకొని ప్రముఖ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తలైవి చిత్ర నిర్మాణంలోకి మళ్లించినట్లు ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఫిర్యాదును ఉన్నతాధికారుల సూచనతో న్యాయ సలహాకు పంపినట్లు ఎస్సై రాంబాబు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?