కారు ప్రమాదంలో బాయ్ ఫ్రెండ్ దుర్మరణం.. గుర్తు చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చిన నటి

pratap reddy   | Asianet News
Published : Sep 10, 2021, 09:41 AM IST
కారు ప్రమాదంలో బాయ్ ఫ్రెండ్ దుర్మరణం.. గుర్తు చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చిన నటి

సారాంశం

బాలీవుడ్ నటి షమితా శెట్టి.. శిల్పా శెట్టికి సోదరి. షమితా శెట్టి ప్రస్తుతం బిగ్ బాస్ ఓటిటిలో పాల్గొంటోంది.

బాలీవుడ్ నటి షమితా శెట్టి.. శిల్పా శెట్టికి సోదరి. షమితా శెట్టి ప్రస్తుతం బిగ్ బాస్ ఓటిటిలో పాల్గొంటోంది. తాజాగా తన హౌస్ మేట్ నేహా బాసిన్ తో మాట్లాడుతుండగా తన పర్సనల్ లైఫ్ లో జరిగిన దుర్ఘటనను షమితా రివీల్ చేసింది. ఆ సంఘటనని గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. 

తన మొదటి బాయ్ ఫ్రెండ్ కారు ప్రమాదంలో మరణించాడని షమితా తెలిపింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ షమితా కన్నీరు ఆపుకోలేకపోయింది. నేహా బాసిన్ షమితా ని ఓదార్చే ప్రయత్నం చేసింది. మరణించిన తన బాయ్ ఫ్రెండ్ పేరుని షమితా రివీల్ చేయలేదు. 

ఇక రాకేష్ తో తన రిలేషన్ ని కూడా షమితా బయట పెట్టింది. వీరిద్దరూ కలసి కొన్ని షోలు చేశారు. తమ మధ్య ఆకర్షణ పెరిగినట్లు షమితా శెట్టి తెలిపింది. అతడితో కూడా బ్రేకప్ అయ్యిందట.అందుకే చాలా రోజులగా తన లైఫ్ లోకి ఎవ్వరిని రానివ్వలేదని క్లారిటీ ఇచ్చింది షమితా. 

నేను కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది.అప్పటివరకు ఎలాంటి రిలేషన్ షిప్స్ పెట్టుకోను అని తెలిపింది. సింగిల్ గా ఉంటుంటే ప్రశాంతంగా ఉంటోంది అని షమితా పేర్కొంది. షమితా శెట్టి 2003లో తెలుగులో హీరో ఆకాష్ కి జోడిగా పిలిస్తే పలుకుతా అనే చిత్రంలో నటించింది. 

 

PREV
click me!

Recommended Stories

Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు