క్రికెట్ వరల్డ్ కప్ పై ప్రస్తుతం ఉత్కంట సాగుతున్నవేళ.. గెలుపు ఎవరిదవుతుందనేది ఎవరికి వారు విశ్లేషిస్తున్నారు. ఈక్రమంలో తన అభిప్రాయం వెల్లడించాడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. ఇంతకీ తలైవా ఏమన్నారు.
ప్రస్తుతం అందరి దృష్టి క్రికెట్ మ్యాచ్ పైనే ఉంది. వరల్డ్ కప్ 2023 లో భాగంగా మ్యాచ్ లు అన్నీ పూర్తి అవ్వగా.. ఫైనల్ మ్యాచ్ఈరోజు జరగబోతోంది. వరుసగా 8వ సారి ఫైనల్స్ కు వచ్చింది భారత్. ఈసారిఎలాగైనా మ్యాచ్ గెలిచి కప్ కొట్టాలని పట్టదులత ఉంది టీమ్. ఈక్రమంలో మ్యాచ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. అంతే కాదు ఈ ఫైనల్ పోరు చూడటానికి ముఖ్య అతిధిగా భారత ప్రధాని మోది రాబోతున్నారు. ఇక కప్ ఎవరు గెలుస్తారు అనే విషయంలో ఎవరి విష్లేషనలు వారు చేస్తున్నారు. ఈ విషయంలో తన అభిప్రాయం వెల్లడించారు సూపర్ స్టార్ రజినీకాంత్.
ఈ సారి భారత్ పక్కాగా వరల్డ్ కప్ గెలిచి తీరుతుందని సూపర్ స్టార్ రజనీకాంత్ విశ్వాసం వ్యక్తం చేశారు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రజనీకాంత్ సతీసమేతంగా ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. ఆమ్యాచ్ ను చూసిన తలైవా.. భారత్ విజయంతో సంబరం చేసుకున్నారు. ఆటనుఆసాంతం ఎంజాయ్ చేశారు సూపర్ స్టార్ . ఇక ఆయన గురువారం చెన్నైకి తిరిగొచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
పిల్లల కోసం ఆ అలవాటు మార్చుకున్న అల్లు అర్జున్..? పెళ్లి తరువాత బన్నీ మారిపోయారా..?
న్యూజిలాండ్‌తో.. తో జరిగిన మ్యాచ్ గురించి రజినీకాంత్ మాట్లాడుతూ.. తొలుత కాసేపు టెన్షన్‌గా అనిపించింది. ఒక్కో వికెట్ పడే కొద్దీ పరిస్థితి అనుకూలంగా మారింది. కానీ ఆ గంటన్నర సమయంలో మాత్రం చాలా టెన్షన్‌గా అనిపించింది. అయితే, ఈ సారీ ప్రపంచకప్ భారత్‌దే అని నమ్మకంగా చెప్పగలను అని రజనీకాంత్ అన్నారు. ఈ మ్యాచ్ లో రికార్డ్ లు క్రియేట్ చేసిన కోహ్లీకి, షమికి తలైవా శుభాకాంక్షలు తెలిపారు.
ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ జైలర్ తో దిల్ ఖుష్అయ్యారు సూపర్ స్టార్. అదే ఉత్సాహంతో నెక్ట్స్ సినిమాలు సెట్స్ఎక్కించి.. సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా 170లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈసినిమా తరువాత లోకేష్ కనగరాజ్ తో మరోసినిమాచేయబోతున్నారు తలైవా. ఈసినిమాకు సబంధించిన అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.