Akhil 'Agent': మహేష్ ని ఆశ్చర్యంలో ముంచెత్తిన 'ఏజెంట్' టీజర్.. సూపర్ స్టార్ రివ్యూ ఇదిగో

Published : Jul 17, 2022, 09:47 AM IST
Akhil 'Agent': మహేష్ ని ఆశ్చర్యంలో ముంచెత్తిన 'ఏజెంట్' టీజర్.. సూపర్ స్టార్ రివ్యూ ఇదిగో

సారాంశం

ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో అఖిల్ అక్కినేని 'ఏజెంట్' చిత్రంలో నటిస్తున్నాడు. అఖిల్ నటించిన గత చిత్రాలు అతడికి ఆశించిన క్రేజ్ తీసుకురాలేదు. 

ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో అఖిల్ అక్కినేని 'ఏజెంట్' చిత్రంలో నటిస్తున్నాడు. అఖిల్ నటించిన గత చిత్రాలు అతడికి ఆశించిన క్రేజ్ తీసుకురాలేదు. అక్కినేని ఫ్యాన్స్ కి కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. సురేందర్ రెడ్డి లాంటి సైలిష్, మాస్ చిత్రాల దర్శకుడి దర్శకత్వంలో నటించే ఛాన్స్ రావడంతో అఖిల్ రెచ్చిపోతున్నాడు. 

ఏజెంట్ చిత్రాన్ని ఈ అక్కినేని వారసుడు ప్రాణం పెట్టి చేస్తున్నాడు. దాని అవుట్ పుట్ టీజర్ లో కనిపించింది. ఇటీవల విడుదలైన ఏజెంట్ టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. అఖిల్ మేకోవర్, బాడీ ట్రాన్స్ఫర్ మేషన్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. 

ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని కూడా అఖిల్ సర్ ప్రైజ్ చేశాడు. ఏజెంట్ టీజర్ చూసిన మహేష్ బాబు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. సోషల్ మీడియా వేదికగా ఏజెంట్ టీజర్ కి రివ్యూ ఇచ్చారు. ఏజెంట్ టీజర్ మతిపోగొట్టేలా ఉంది. ఈ చిత్ర థీమ్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అఖిల్ అక్కినేని, మమ్ముట్టి సర్, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర, టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అని మహేష్ ట్వీట్ చేశారు. 

ఏజెంట్' మూవీ తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ కి జోడిగా డెబ్యూ హీరోయిన్ సాక్షి వైద్య నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   

 

 

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం