
తమిళ దర్శకుడు - తెలుగు హీరో, తెలుగు హీరో - తమిళ డైరెక్టర్.. ప్రస్తుతం ఈ కాంబినేషన్‌లో సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. ప్రేక్షకుల్లో భారీ అంచనాలకు తెరలేపుతున్నాయి. ఈ లిస్ట్ లో రీసెంట్ గా రిలీజైన చిత్రం‘ది వారియర్’ (The Warriorr). టాలీవుడ్ స్టార్ రామ్ (Ram Pothineni) హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) రూపొందించిన చిత్రమిది. జులై 14న విడుదల అయ్యింది. ఈ సినిమా మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తమిళ దర్శకులు నేరుగా మన హీరోలుతో రూపొందించిన చిత్రాలు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి.
ఇంతకు ముందు ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్....మన స్టార్ హీరో మహేష్ తో స్పైడర్ చేసారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అలాగే విజయ్ దేవరకొండతో తమిళ దర్శకుడు స్టైయిట్ తెలుగు సినిమా నోటా చేసారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు లింగుస్వామి మన స్టార్ రామ్ తో ది వారియర్ చేసారు. ఆ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా భాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అని తేలింది. ఇవన్ని ఇక్కడ మనకు వర్కవుట్ కావటం లేదు. అందుకు కారణం తమిళ దర్శకులు మన తెలుగు నేటివిటిని పట్టుకోకపోవటమా అనే సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అది ప్రక్కన పెడితే ఇప్పుడు మరో తమిళ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబోలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సెంటిమెంట్ ని రామ్ చరణ్ బ్రేక్ చేస్తాడని అందరూ భావిస్తున్నారు.
రీసెంట్ గా "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "ఆచార్య" సినిమా తో డిజాస్టర్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. #ఆర్సీ15 అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రాంచరణ్ కరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న 50వ ప్రాజెక్ట్ కూడా. అంజలి, శ్రీకాంత్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.