దసరా మూవీకి మహేష్ బాబు రివ్యూ..!

Published : Apr 01, 2023, 12:05 AM IST
దసరా మూవీకి మహేష్ బాబు రివ్యూ..!

సారాంశం

దసరా మూవీపై మహేష్ తన అభిప్రాయం తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు.   

నాని హీరోగా తెరకెక్కిన దసరా మూవీ మార్చి 30న వరల్డ్  వైడ్ విడుదలైంది. కాగా దసరా చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు వీక్షించారట. మూవీ ఎలా ఉందో వన్ వర్డ్ రివ్యూ ఇచ్చారు. 'దసరా గర్వించదగ్గ చిత్రం. అద్బుతంగా ఉంది' అని ఫైర్ ఎమోజీలు పోస్ట్ చేశారు. మహేష్ బాబు సినిమాపై స్పందించడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. 

గతంలో మహేష్ పాప్యులర్ సినిమాలకు రివ్యూలు ఇచ్చేవారు. ముఖ్యంగా పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రాల గురించి ఖచ్చితంగా ట్వీట్ వేసేవారు. ఈ మధ్య ఆయన షార్ట్ రివ్యూలు ఇవ్వడం మానేశారు. మళ్ళీ దసరా చిత్రంపై మహేష్ పాజిటివ్ కామెంట్ చేశారు. ఒక విధంగా మహేష్ దసరా చిత్రాన్ని ప్రమోట్ చేసినట్లు అయ్యింది. ఇది దసరా చిత్రానికి కలిసొచ్చే అంశమే. 

దసరా పాజిటివ్ టాక్ దక్కింది. ఫస్ట్ డే వసూళ్లు దుమ్ముదులిపింది. సెకండ్ డే కొంచెం నెమ్మదించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే వీకెండ్ మిగిలే ఉండగా... దసరా చిత్రానికి ప్లస్ కావచ్చు. దర్శకుడు శీకాంత్ ఓదెల దసరా చిత్రాన్ని తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. నానికి జంటగా కీర్తి సురేష్ నటించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. దసరా పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kokkoroko మూవీతో అలరించేందుకు వస్తోన్న యంగ్‌ సెన్సేషన్‌.. కొత్త పోస్టర్‌ అదిరింది
Dhoolpet Police Station Review: `ధూల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌` కేస్‌ 1 వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. చూపు తిప్పుకోలేరు