IPL 2023: ఐపీఎల్ కామెంటేటర్ గా బాలయ్య గ్రాండ్ ఎంట్రీ.. స్టేడియం దద్దరిలింది!

Published : Mar 31, 2023, 07:59 PM ISTUpdated : Mar 31, 2023, 08:21 PM IST
IPL 2023: ఐపీఎల్ కామెంటేటర్ గా బాలయ్య గ్రాండ్ ఎంట్రీ.. స్టేడియం దద్దరిలింది!

సారాంశం

నందమూరి నటసింహం నయా అవతారం ఎత్తారు. ఆయన ఐపీఎల్ కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు కామెంటేటర్స్ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.   

బాలకృష్ణ ఐపీఎల్ కామెంటేటర్ గా వస్తున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. దీనిపై స్టార్ స్పోర్ట్స్ తెలుగు అధికారిక ప్రకటన చేసింది. నేడు ఐపీఎల్ లాంచింగ్ ఈవెంట్ కి ముందు బాలయ్య తెలుగు కామెంటేటర్స్ తో కలిశారు. తన మార్క్ ఎంటర్టైన్మెంట్ పంచారు. ఐపీఎల్ ఈవెంట్లో బాలయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జై బాలయ్య సాంగ్ తో ఆయనకు తెలుగు కామెంటేటర్స్ స్వాగతం పలికారు. హీరో నందుతో పాటు స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటేటర్స్ ఆశిష్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణలతో ఆయన ముచ్చటించారు. 

క్రికెటర్ గా తన అనుభవాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. స్కూల్ డేస్ లో నేను క్రికెట్ ఆడేవాడిని. కాలేజ్ డేస్ లో అజారుద్దీన్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వంటి మేటి క్రికెటర్స్ తో అనుబంధం ఉందన్నారు. ఇక ఈ ఐపీఎల్ లో తన మద్దతు తెలుగు టీమ్ సన్ రైజర్స్ కే అన్నారు. ఐపీఎల్ కప్ తెలుగువారు గెలుచుకోవాలని కాంక్షించారు. ప్రస్తుతం బాలయ్య హీరోగా 108వ చిత్రం తెరకెక్కుతుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీలల కీలక రోల్ చేస్తున్నారు. 
 

మార్చి 31 శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో Indian Premier League (ఐపీఎల్) 2023 ఘనంగా మొదలైంది. ఈ వేడుకలో స్టార్ హీరోయిన్స్ సందడి చేశారు.మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఎనిమీ చిత్రంలోని మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ 'టమ్ టమ్'కి స్టెప్స్ వేశారు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న సైతం డాన్స్ తో అదరగొట్టారు. 

తమన్నా హీరోయిన్ గా రెండు బడా ప్రాజెక్ట్ తెరకెక్కుతున్నాయి. జైలర్, భోళా శంకర్ చిత్రాల్లో తమన్నా నటిస్తున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. కెరీర్లో మొదటిసారి జైలర్ మూవీతో రజనీకాంత్ తో జతకడుతున్నారు. ఇక రష్మిక పుష్ప 2, యానిమల్ వంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల నితిన్ కి జంటగా మరో మూవీ ప్రకటించింది. 
 


 

PREV
click me!

Recommended Stories

Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌
Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?