నిండు గర్భంతో చేయకూడని పని చేసిన హీరోయిన్ పూర్ణ... తిట్టిపోస్తున్న జనాలు!

Published : Mar 31, 2023, 09:08 PM IST
నిండు గర్భంతో చేయకూడని పని చేసిన హీరోయిన్ పూర్ణ... తిట్టిపోస్తున్న జనాలు!

సారాంశం

హీరోయిన్ పూర్ణ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. తొమ్మిది నెలల గర్భంతో ఆమె చేసిన పని విమర్శల పాలవుతుంది.   


పూర్ణ తొమ్మిది నెలల నిండు గర్భంతో ఉన్నారు. గత ఏడాది పూర్ణ తల్లైన విషయం వెల్లడించారు. దుబాయ్ కి చెందిన షాహిన్ అసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను పూర్ణ 2022 జూన్ లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం అత్యంత సన్నిహితుల మధ్య దుబాయ్ లో జరిగింది. నిశ్చితార్థ విషయం చెప్పిన పూర్ణ పెళ్లి మేటర్ దాచారు. కొన్నాళ్లకు పెళ్లి చేసుకున్న విషయం బయటపెట్టారు. కొన్ని కారణాలతో అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి ముగించామని ఆమె వెల్లడించారు. 

ఇక ఆలస్యం చేయకుండా పిల్లల్ని ప్లాన్ చేశారు. ప్రస్తుతం పూర్ణ గర్భవతి కాగా కొద్దిరోజుల్లో డెలివరీ కానుంది. కాగా నెలలు నిండిన పూర్ణ పాటకు డాన్స్ చేసి విమర్శలు పాలైంది. లేటెస్ట్ రిలీజ్ దసరా మూవీలో పూర్ణ వదినమ్మ పాత్ర చేశారు. ఈ మూవీలో కీర్తి సురేష్-నాని మీద తెరకెక్కిన 'చమ్కీల అంగీలేసి' సాంగ్ బాగా ప్రాచుర్యం పొందింది. ఆ పాటకు పూర్ణ డాన్స్ చేశారు. ఆ వీడియో చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. 

నిండు గర్భంతో డాన్స్ చేస్తావా? ఈ సమయంలో అలాంటి పనులు చేయకూడదని తెలియదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పూర్ణ తీరు విమర్శల పాలవుతుంది. నిజంగా అది అత్యంత ప్రమాదం. ఆవిడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి వీడియోల కోసం తాపత్రయ పడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా బిడ్డను కని బయటపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

సీమ టపాకాయ్, అవును వంటి చిత్ర చిత్రాల్లో నటించిన పూర్ణ... హీరోయిన్ గా చెప్పుకోదగ్గ స్థాయికి వెళ్లలేకపోయారు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. దృశ్యం, అఖండ, తీస్ మార్ ఖాన్ చిత్రాల్లో కీలక రోల్స్ చేశారు. అలాగే బుల్లితెర మీద సందడి చేస్తున్నారు. కామెడీ, రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?