
సూపర్ స్టార్ మహేష్ బాబుకు రెండే ప్రపంచాలు..అయితే సినిమా షూటింగ్స్... అవి లేకుంటే ఇల్లు. ఈరెండు తప్పితే ఫ్యామిలీతో ఫారిన్ టూర్లు.. ఇవి తప్పితే బయటకు వచ్చేది లేదు, పార్టీలకు, ఫంక్షల్లకు వెళ్ళేది లేదు. ఫ్యామిలీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు మహేష్. పోరపాటున బయటకు వచ్చి.. ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్స్ కు వచ్చాడంటే అది పెద్ద విశేషమే. కాని తాజాగా అదే జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు బయటకు వచ్చారు. నమ్రతతో కలిసి ఓ పెళ్లిలో సందడి చేశారు. అక్కడున్నవారిని ఆశ్చర్చానికి గురిచేశాడు.
ఇక ఇక్కడ విశేషం ఏంటీ అంటే మహేష్ న్యూ లుక్. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా చేస్తున్న మహేష్ బాబు.. ఈసినిమా కోసం కొత్త లుక్ లో కనిపించాడు. యంగ్ లుక్ లోకి మారాడు. సినిమాల కోసం రకరకాల లుక్స్ మార్చేస్తూ ఉంటాడు సూపర్ స్టార్. కాని బయట మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు. అదే విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు. చెప్పడం కాదు అలానే ఉంటాడు. రీసెంట్ గా పెళ్లికి హాజరైన మహేష్ బాబు లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సింపుల్ గా వైట్ షర్ట్.. బ్లూ జీన్స్ లో సూపర్ స్టార్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇక మహేష్ పక్కన నమ్రత రెడ్ కలర్ చూడిదార్ లో మెరిసిపోయింది. ఈ ఇద్దరు జటంగా కనిపించి అభిమానులకు కన్నుల పండుగ చేశారు. హైదరాబాద్ లో తన ఫ్యామిలీ ఫ్రెండ్ కామేశ్వరరావు కొడుకు పెళ్లికి వెళ్లిన మహేష్.. చాలా నార్మల్ గా కనిపించారు. పెళ్ళికి సతీసమేతంగా వచ్చి.. జంటను ఆశీర్వదించి వెళ్ళాడు మహేష్. ప్రస్తుతం ఈ ఫోటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం SSMB28 హడావిడిలో ఉన్నాడు మహేష్ బాబు. ఈసినిమా స్టార్ట్ చేసి ఏడాదిపైనే అవుతున్నా.. మధ్యలో చాలా అడ్డంకులు వల్ల షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. ఇక ఇప్పుడు షూటింగ్ ను పరుగులుపెట్టించబోతున్నారు.
ఈసినిమాలో మహేష్ బాబు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. రెండో సారి మహేష్ సినిమాలో సందడి చేయబోతోంది బ్యూటీ. ఈసినిమా కోసం హైదరాబాద్ లో స్పెషల్ గా సెట్ కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ తో సినిమాను త్వరగా కంప్లీట్ చేసి.. రాజమౌళి సినిమాలో జాయిన్ కాబోతున్నాడు మహేష్ బాబు. జక్కన్నతో పాన్ వరల్డ్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. ఆఫ్రికా అడవుల్లో అడ్వెంచర్ కథతో.. ఈసినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి టీమ్.. ఈసినిమాపై వర్క్ చేస్తున్నట్టు సమాచారం.