
సోషల్ మీడియా సెలెబ్రిటీలైన దీప్తి సునైన-షణ్ముఖ్ జస్వంత్ విడిపోయి చాలా కాలం అవుతుంది. 2021లో దీప్తి సోషల్ మీడియా వేదికగా తమ బ్రేకప్ మేటర్ రివీల్ చేశారు. కారణాలు వివరించకున్నప్పటికీ... షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పినట్లు అభిమానులతో పంచుకున్నారు. కాగా సిరి హన్మంత్ వలనే విడిపోయారన్న మాట గట్టిగా వినిపించింది. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్, సిరి సన్నిహితంగా మెలిగారు. చెప్పాలంటే స్నేహితులమని చెప్పుకుంటూ ప్రేమికులకు మించి రొమాన్స్ చేశారు.
ఇదంతా బయట నుండి గమనిస్తున్న దీప్తి మనసు గాయపడిందని, తాను అమితంగా ప్రేమించే వ్యక్తి మరొకరికి దగ్గరైనందుకు దీప్తి హర్ట్ అయ్యారని కథనాలు వెలువడ్డాయి. బిగ్ బాస్ షో ముగిసిన అనంతరం దీప్తి బ్రేకప్ ప్రకటన చేయడం అనుమానాలకు బలం చేకూర్చింది. అప్పటి నుండి దీప్తి-షణ్ముఖ్ విడివిడిగా ఉంటున్నారు. కెరీర్ పై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. షణ్ముఖ్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. డిజిటల్ సిరీస్లు, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నారు.
కాగా షణ్ముఖ్ తన ఎక్స్ లవర్ దీప్తికి షాక్ ఇస్తూ కొత్త పార్ట్నర్ ని వెతుకున్నాడు. ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్ 'అయ్యయ్యో'లో షణ్ముఖ్ లవర్ గా ఫణి పూజిత నటిస్తున్నారు. ఇటీవల అయ్యయ్యో ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. దీప్తితో బ్రేకప్ కావడంతో చేసేది లేక తన ప్రాజెక్ట్స్ కి షణ్ముఖ్ వేరే అమ్మాయిలను ఎంచుకుంటున్నారు. షణ్ముఖ్ లవర్ గా రొమాన్స్ చేయాల్సిన దీప్తి మనస్పర్థలతో దూరమయ్యారు. ఇక అయ్యయ్యో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
ఇటీవల దీప్తి, షణ్ముఖ్ దగ్గరైన సూచనలు కనిపించాయి. ఇద్దరూ కలిసి ఈవెంట్స్ లో పాల్గొన్నారు. దీప్తికి సోషల్ మీడియాలో షణ్ముఖ్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ కోపతాపాలు ఎన్నాళ్లు ఉంటాయిలే కలిసిపోతున్నారని అందరూ భావించారు. కానీ అలా జరగడం లేదు. ఎడబాటు కారణంగా ఇద్దరూ నష్టపోయారు. యూట్యూబ్ లో ఈ జంటకు మంచి డిమాండ్ ఉంది. షణ్ముఖ్-దీప్తి కాంబోలో వచ్చిన ప్రాజెక్ట్స్ ఆదరణ దక్కించుకున్నాయి.
ఐదేళ్లకు పైగా దీప్తి-షణ్ముఖ్ మధ్య లవ్ ఎఫైర్ నడిచింది. యూట్యూబ్ కోసం షార్ట్ ఫిల్మ్, డాన్స్ వీడియోలు చేసే క్రమంలో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. కాగా దీప్తి సునైన సైతం బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. యూట్యూబ్ స్టార్ హోదాలో దీప్తికి ఆ అవకాశం దక్కింది. షణ్ముఖ్ కంటే ముందు దీప్తి బిగ్ బాస్ షోకి వెళ్ళింది.