Mahesh Babu Latest Look: వాట్ ఏ లుక్... హాలీవుడ్ స్టార్స్ ఏం సరిపోతారు!

Published : Aug 14, 2022, 01:41 PM IST
Mahesh Babu Latest Look: వాట్ ఏ లుక్... హాలీవుడ్ స్టార్స్ ఏం సరిపోతారు!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ తన లేటెస్ట్ లుక్ లో కేక పుట్టించారు. హాలీవుడ్ స్టార్స్ ని తలదన్నేలా క్లాస్ మాస్ కలగలిపి సరికొత్తగా సిద్ధమయ్యారు. హ్యాండ్ సమ్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మహేష్ లుక్ వైరల్ గా మారింది.

ఇండియాలోనే హ్యాండ్ సమ్ హీరోస్ లిస్ట్ లో మహేష్(Mahesh babu) ఖచ్చితంగా టాప్ లో ఉంటారు. అమ్మాయిల కలల రాకుమారుడిగా వెండితెరను ఏలుతున్న ఈ సూపర్ స్టార్ ఎవర్ గ్రీన్ గ్లామర్ తో మెరిసిపోతున్నారు. ఆయన యాభై ఏళ్లకు దగ్గరైనా కూడా ఏమాత్రం అందం తగ్గడం లేదు. వయసు పెరిగేకొద్దీ మహేష్ అందం రెట్టింపు కావడం విశేషం. వారసత్వంగా తండ్రి కృష్ణ నుండి వచ్చిన గ్లామర్ ని మహేష్ మరింత జాగ్రత్తగా కాపాడుకుంటూ వెండితెరపై అద్భుతాలు చేస్తున్నారు. మహేష్ కంటే వెనకొచ్చిన తక్కువ వయసు హీరోలు ఆయన కంటే పెద్దగా కనిపిస్తుంటే మహేష్ మాత్రం చిన్నపిల్లాడు అయిపోతున్నాడు. 

ఇక మహేష్ తన లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. హాలీవుడ్ స్టార్స్ ని కూడా తలదన్నేలా ఆయన లుక్ ఉంది. మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ కాగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో తన నెక్స్ట్ మూవీ కోసం మహేష్ ఇలా సిద్దమయ్యారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 

గతంలో మహేష్ నటించని, త్రివిక్రమ్ తెరకెక్కించని చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పడం విశేషం. ఇది త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ఉహాగానాలు వెలువడుతున్న తరుణంలో మహేష్ చేసిన ఈ కామెంట్ క్యూరియాసిటీ పెంచేసింది. మహేష్ ని త్రివిక్రమ్ ఎలా చూపించనున్నారో అనే ఆత్రుత మొదలయ్యింది. ఈ మూవీలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. మరో హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇక వచ్చే ఏడాది రాజమౌళి దర్శకత్వంలో మహేష్ మూవీ ప్రారంభం కానుంది. రాజమౌళి గత చిత్రాలకు మించి భారీ బడ్జెట్ తో మహేష్ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి కూడా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. స్క్రిప్ట్ ఫైనల్ దశలో ఉన్నట్లు సమాచారం. మహేష్ తో పాటు ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌
Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?