అమీర్ ఖాన్ కు హృతిక్ రోషన్ సపోర్ట్.. ‘విక్రమ్ వేదా’ను టార్గెట్ చేసిన నెటిజన్లు..

By team teluguFirst Published Aug 14, 2022, 12:36 PM IST
Highlights

బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రమ్ వేదా’. మొన్నటి వరకు అమీర్ ఖాన్ చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ను బైకాట్ చేయగా.. తాజాగా Bycottvikramvedha హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.  
 

బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటిస్తున్న భారీ ఫిల్మ్ ‘విక్రమ్ వేదా’(Vikram Vedha). పుష్కర్ - గాయత్రి మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తమిళంలో 2017లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘విక్రమ్ వేద’ను అదే టైటిల్ తో హిందీలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఫిల్మ్ నుంచి హృతిక్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఆడియెన్స్ నుంచి కూడా భారీ రెస్పాన్స్ దక్కింది. అయితే తాజాగా ‘విక్రమ్ వేదా’ను బహిష్కరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు  #BycottVikramvedha హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తున్నారు. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan), స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. అయితే గతంలో అమీర్ ఖాన్ హిందు దేవతలు, విగ్రహాలపై చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతూ Laal Singh Chaddha సినిమాను వ్యతిరేకించారు. నిన్నటి వరకు అమీర్ ఖాన్ కు సపోర్ట్ చేసిన షారుఖ్ ఖాన్ ను కూడా టార్గెట్ చేశారు. తాజాగా అమీర్ ఖాన్ కు హృతిక్ రోషన్ మద్దతుగా నిలవడమే కాకుండా.. నిన్న ముంబైలోని ఓ థియేటర్ లో ‘లాల్ సింగ్ చడ్డా’ను చూశాడు. అదీగాక చిత్రంపైనా తన రివ్యూను ట్విట్టర్ వేదికన వదిలారు. 

ట్వీట్ లో.. ‘ఇప్పుడే లాల్ సింగ్ చడ్డా సినిమాను చూశాను. ఈ సినిమాతో నా హృదయాన్ని అనుభూతి చెందింది. ప్లస్‌లు, మైనస్‌లను పక్కన పెడితే సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఇంతటి అద్భుతమైన సినిమాను మిస్ అవ్వకండి అబ్బాయిలు.. వెళ్ళండి.. ఇప్పుడే వెళ్లి చిత్రాన్ని చూడండి. చాలా బాగుంది.’ అంటూ రివ్యూ ఇచ్చాడు. దీంతో ట్రోలర్స్ హృతిక్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆయన నటిస్తున్న ‘విక్రమ్ వేద’నూ బైకాట్ చేయాంటూ నిరసన తెలుపుతున్నారు. ‘మీరు మీ సినిమాపై ఫోకస్ పెట్టడానికి బదులు.. మరొకరి సినిమాకు మద్దతు ఇవ్వడానికి  ప్రయత్నిస్తున్నారు. దీని ఫలితం ఎలా ఉంటుందో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ మరో నెటిజన్ పోస్ట్ పెట్టారు. మొత్తానికి ఈ చిచ్చులోకి హృతిక్ రోషన్ ఎంటర్ అవడం చర్చనీయాంశంగా మారింది.

 

You should not have done this👎 Instead of focussing on your film, you are trying to support others. Now get ready to face the consequences.

Vikram Vedha will be next target. https://t.co/BIMoUZ7mmR

— Nikki Tamboli™ (@Team_NikkiT)
click me!