వైఎస్ రాజశేఖర్ రెడ్డి అద్భుతమైన వ్యక్తి-మహేష్ బాబు

Published : Sep 26, 2017, 05:07 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అద్భుతమైన వ్యక్తి-మహేష్ బాబు

సారాంశం

 రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని సూపర్ స్టార్ మహేష్ తాజాగా స్పైడర్ ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో బిజీగా మహేశ్ బాబు ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో రాజశేఖర్ రెడ్డి అద్భుతమైన వ్యక్తి అన్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు బయట విషయాలంటే పెద్దగా స్పందించరు. సినిమాల వరకే అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఇతర విషయాలపై సైలెంట్ గా ఉండే మహేష్ బాబు తాజాగా కొన్ని ఊహించని వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాల గురించి అసలు మాట్లాడని మహేష్ బాబు ఎన్నడూ లేనిది... రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయంగా ప్రభావితం చేసే విధంగా వైఎస్ తో తనకున్న అనుబంధం గురించి ప్రస్తావించారు.

 

వైఎస్ రాజశేఖరరెడ్డి అద్భుతమైన వ్యక్తి అని హీరో మహేష్ బాబు అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘రాజకీయాలను పక్కన పెడితే.. గతంలో నేను ఆయన్ని కలిశాను. మా నాన్న ఆయనకు చాలా క్లోజ్. నేను కలిసినప్పుడు జగన్ గారు కూడా ఉన్నారు. రాజశేఖరెడ్డి ఓ అద్భుతమైన వ్యక్తి’ అని అన్నాడు. తనకు రాజకీయాల గురించి తెలియదని, అందులోకి రానని ఓ ప్రశ్నకు సమాధానంగా మహేష్ బాబు చెప్పాడు. ‘దూకుడు’ సినిమాలో రాజకీయనాయకుడిగా నటించారు కదా, నిజజీవితంలో పాలిటిక్స్ లోకి రావొచ్చుగా?’ అని ప్రశ్నించగా, సినిమాల్లో నటించడం వరకే తనకు తెలుసని మహేష్ సమాధానమిచ్చాడు

PREV
click me!

Recommended Stories

Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు
అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్