హైదరాబాద్ లో తొలిసారిగా ‘ఫార్మూలా ఈ’ రేస్.. స్పందించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు!

By team telugu  |  First Published Jan 24, 2023, 6:00 PM IST

దేశంలోనే హైదరాబాద్ లో మొట్టమొదటి సారిగా Formula E Race జరగబోతుండటంతో అందరీలో ఉత్కంఠ నెలకొంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తాజాగా స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. 
 


మొట్టమొదటిసారిగా భారతదేశంలోని హైదరాబాద్ లో ABB FIA Formula E వరల్డ్ ఛాంపియన్ షిప్ రేసింగ్ జరగబోతోంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) చేస్తున్నారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న ఐమాక్స్ నుంచి రేస్ ప్రారంభం కానుంది. అక్కడి నుంచి 2.8 కిలోమీటర్ల మేర 18 టర్న్ తో ఈ ట్రాక్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. దాదాపు ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. 

అయితే, ఫార్మూలా ఈ రేసింగ్ ను హైదరాబాద్ కు తీసుకురావడం పట్ల టాలీవుడ్ స్టార్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కృషి చేసిన తెలంగాణ ప్రభుత్వం మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సుమంత్ మరియు అక్కినేని చైతన్య సహా ఇతర నటీనటులు ప్రశంసలు కురిపించారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూడా స్పందించారు. భారతదేశంలో జరగనున్న మొట్టమొదటి ఫార్ములా Eప్రపంచ ఛాంపియన్‌షిప్ ను హైదరాబాద్‌కు తీసుకురావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్, తెలంగాణ సీఎంవో, అనిల్ చలమలశెట్టిని కృషికి అభినందించారు. ఈ రేసింగ్ తో ప్రజల్లో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ పై అవగాహన వచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Latest Videos

రేసింగ్ ఫిబ్రవరి 11న జరగనుంది. రేసింగ్ ను వీక్షించేందుకు టికెట్లు కూడా ఓపెన్ అయ్యాయి. రోమ్, న్యూయార్క్, లండన్, పారిస్ లో గతంలో జరిగినటు వంటి ఫార్మూలా ఈ రేసును తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహించడం విశేషంగా మారింది. గత అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించేందుకు పోటీ పడ్డాయి, చివరికి హైదరాబాద్‌ను ఎంపిక చేశారు.  22 మంది డ్రైవర్లు, తొమ్మిది దేశాల నుండి 11 జట్లు కొత్త Gen3 ఎరా ఫార్ములా E కార్లలో రేసింగ్‌లో పాల్గొంటాయి.

ఇక, సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఎస్ఎస్ఎంబీ28’లో నటిస్తున్నారు. ఈనెల18నే షూటింగ్ ప్రారంభమైంది. చిత్రంలో పూజా హెగ్దే, శ్రీలీలా హీరోయిన్లు గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ, చిన్నబాబు నిర్మిస్తున్నారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత మహేశ్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో నటించబోతున్నారు. ‘ఎస్ఎస్ఎంబీ29’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

Let's race against climate change! Congratulations garu, , & Anil Chalamalasetty garu on bringing to Hyderabad! Looking forward to on Feb 11th! pic.twitter.com/Lwf1I9T8Cp

— Mahesh Babu (@urstrulyMahesh)
click me!