మహేష్‌ 25వ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌

Published : Mar 03, 2018, 07:14 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
మహేష్‌ 25వ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌

సారాంశం

మహేష్‌ 25వ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ డాన్, తలాష్, రయూస్ లవంటి చిత్రాలకు పనిచేసిన కె.యు.మోహనన్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దిల్ రాజు, అశ్వినిదత్

సూపర్‌స్టార్‌ మహేష్‌ కథానాయకుడుగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ మరియు వైజయంతీ మూవీస్‌ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ కె.యు.మోహనన్‌ పనిచేయనున్నారు.

 

బాలీవుడ్‌లో 2006లో వచ్చిన డాన్‌ చిత్రానికి, తలాష్‌, రయీస్‌ వంటి భారీ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్‌ని అందించిన కె.యు.మోహనన్‌... సూపర్‌స్టార్‌ మహేష్‌ నటిస్తున్న 25వ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేయనున్నారు. 

 

మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్‌, సినిమాటోగ్రఫీ: కె.యు.మోహనన్‌, నిర్మాతలు: సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి

PREV
click me!

Recommended Stories

Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ