Bigg Boss Telugu 5: రెండు సెకండ్ల తేడాతో షణ్ముఖ్ ని బీట్ చేసిన సన్నీ.. కాజల్ రెచ్చిపోతోందిగా

pratap reddy   | Asianet News
Published : Dec 02, 2021, 11:31 PM IST
Bigg Boss Telugu 5: రెండు సెకండ్ల తేడాతో షణ్ముఖ్ ని బీట్ చేసిన సన్నీ.. కాజల్ రెచ్చిపోతోందిగా

సారాంశం

బిగ్ బాస్ తెలుగు 5 (Bigg Boss Telugu 5) గురువారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. టికెట్ టు ఫినాలే టాస్కులు ఆకట్టుకునే విధంగా సాగుతున్నాయి. టికెట్ టు ఫినాలేలో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.

బిగ్ బాస్ తెలుగు 5 (Bigg Boss Telugu 5) గురువారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. టికెట్ టు ఫినాలే టాస్కులు ఆకట్టుకునే విధంగా సాగుతున్నాయి. టికెట్ టు ఫినాలేలో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. నేటి ఎపిసోడ్ షణ్ముఖ్, కాజల్ మధ్య మాటల యుద్ధంతో మొదలయింది. బెడ్ పై రిలాక్స్ గా పడుకునే ఇద్దరూ విమర్శించుకున్నారు. 

షణ్ముఖ్, కాజల్ ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. మాటకు మాట సమాధానం ఇస్తూ ఆర్గుమెంట్ కొనసాగించారు. మనిద్దరిలో ఎవరు ముందు హౌస్ నుంచి వెళ్ళిపోతే వారిదే తప్పు ఉన్నట్లు అని షణ్ముఖ్ ఘాటుగా బదులిచ్చాడు. నీకంటే ముందు నేను హౌస్ నుంచి వెళ్ళను అని కాన్ఫిడెంట్ గా బదులిచ్చాడు షణ్ముఖ్. 

ఇక ఎప్పటిలాగే మానస్ అవాయిడ్ చేస్తున్నప్పటికీ అతడి వెంట పడే ప్రయత్నం చేసింది ప్రియాంక. కిచెన్ లో చిన్నపాటి చిలిపి సరదా వీరిద్దరి మధ్య చోటు చేసుకుంది. వీరిద్దరికి మీడియేటర్ గా సన్నీ వ్యవహరించాడు. మానస్ మాత్రం పింకీని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. 

ఇక టికెట్ టు ఫినాలేలో పాల్గొనేందుకు అర్హత కోసం బిగ్ బాస్ ఆసక్తికర టాస్క్ ఇచ్చారు. ఏటవాలుగా ఉన్న కాలువ లాంటి బల్లలపై పోటీలో పాల్గొనేవారు బకెట్స్ లో ఉన్న నీరు పోయాలి. ఆ బల్లల కింద కొన్ని జాడీలో అమర్చి ఉంటాయి. నీటితో ఆ జాడీలో నిండిన తర్వాత అందులో ఉన్న బాల్స్ పైకి వచ్చి కింద పడతాయి. అలా ముందుగా ఎవరైతే నీరు పోసి ఆ బాల్స్ ని కిందపడేలా చేస్తారో వారే విజేత. బాల్స్ అన్నీ కింద పడిన తర్వాత గంట కొట్టాలి. అప్పుడే వారి టాస్క్ పూర్తయినట్లుగా పరిగణించబడుతుంది. 

సిరి, శ్రీరామ్ ఇద్దరూ గాయాలతో ఉన్న సంగతి తెలిసిందే. దీనితో సిరికి బదులుగా షణ్ముఖ్..శ్రీరామ్ కి బదులుగా సన్నీ గేమ్ ఆడతారు. ఆ తర్వాత కాజల్ , ప్రియాంక మధ్య పోటీ జరుగుతుంది. చివరగా షణ్ముఖ్, సన్నీ మధ్య పోటీ జరగగా ఆ పోటీలో సన్నీ విజయం సాధిస్తాడు. షణ్ముఖ్ 20 సెకండ్లలో బాల్స్ కిందపడేలా చేస్తాడు. షణ్ముఖ్ కి 22 సెకండ్ల టైం పడుతుంది. దీనితో సన్నీ విజయం సాధించి టికెట్ టు ఫినాలే పోటీలోకి అర్హత సాధిస్తాడు. 

ప్రస్తుతం టికెట్ టు ఫినాలే రేసులో మానస్ 18 , శ్రీరామ్16, సిరి15, సన్నీ 10 పాయింట్లతో అర్హత సాధించారు. వీరి మధ్య శుక్రవారం ఎపిసోడ్ లో మరికొన్ని పోటీలు జరగనున్నాయి. 

Also Read: నాజూకైన అందాలని స్కిన్ ఫిట్ డ్రెస్ లో బంధించిన దిశా పటాని.. మెస్మరైజింగ్ పిక్స్ వైరల్

Also Read: హాఫ్ శారీ పిచ్చెక్కించేలా నార్త్ బ్యూటీ ఫోజులు.. నడుము అందాలతో హాట్ షో

PREV
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?