సన్నీకి ఒళ్లు మండింది.. వర్మకు క్లాస్ పీకింది

Published : Mar 10, 2017, 10:12 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
సన్నీకి ఒళ్లు మండింది.. వర్మకు క్లాస్ పీకింది

సారాంశం

వర్మకు క్లాస్ పీకిన సన్నీ లియోనీ మహిళా దినోత్సవం సందర్భంగా సన్నీపై వర్మ కమెంట్స్ వివాదాస్పదం కావటంతో తగ్గి క్షమాపణలు చెప్పిన వర్మ మనం మాటకు కట్టుబడి ఉండాలంటున్న సన్నీ లియోనీ

మహిళా దినోత్సవం సందర్భంగా సంతలన దర్సకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే, చివరికి రామ్ గోపాల్ వర్మ ఆ ట్వీట్ పట్ల క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అయితే వర్మ చేసిన సంచలన ట్వీట్ ఇప్పుడు సన్నీకి ఒళ్లు మండేలా చేసింది. దాంతో తనదైన శైలిలో స్పందించింది.

 

మనం ఒకే మాటకి కట్టుబడి ఉన్నప్పుడే మార్పు సాధ్యమవుతుంది.. కాబట్టి, మాటల్ని తెలివిగా ఎంపిక చేసుకోండి.. పీస్‌ అండ్‌ లవ్‌..' అంటూ సన్నీలియోన్‌ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. 'ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని చూస్తున్నా..' అంటూ వీడియోలో తన మాటల్ని మొదలెట్టింది సన్నీలియోన్‌. సింపుల్‌గా 10 సెకెన్ల వీడియోలోనే సన్నీలియోన్‌ చెప్పాలనుకున్నదంతా చెప్పేసింది. 

 

మహిళా దినోత్సవం రోజున సన్నీలియోన్‌, మహిళల్ని ఉద్దేశించి, 'సన్నీలియోన్‌లా ఆనందం పంచండి..' అంటూ వర్మ చేసిన పోస్టింగ్‌తో కలకలం రేగింది. వర్మ మీద కేసులు కూడా నమోదయ్యాయి. అంతకు ముందు వర్మ, తనకు ఇచ్చిన కాంప్లిమెంట్‌కి సన్నీలియోన్‌ మురిసిపోతూ, వర్మ ట్వీట్‌కి రిప్లయ్‌ కూడా ఇచ్చింది.

 

కానీ వర్మ మీద కేసు నమోదయ్యింది. వర్మని కొందరు చెప్పులతో కొడ్తామన్నారు. దాంతో, వర్మ కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 'క్షమాపణ' చెప్పేశాడు. ఇక్కడే సన్నీలియోన్‌కి ఒళ్ళు మండిపోయి వుండొచ్చేమోనన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం తాలూకు సారాంశం. 'ఒకే మాట మీద వుండాలి..' అన్న ప్రస్తావన, 'క్షమాపణ చెప్పకుండా వుండాల్సింది..' అన్న ఉద్దేశ్యంతోనే కావొచ్చేమో.!  ఏదో క్యాజువల్‌గా, జనరల్‌గా అలా చెప్పింది.. అనుకోవడానికి సన్నీ అస్సలు ఆస్కారం ఇవ్వలేదు.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు