చిరు సినిమాలో సునీల్ కి ఛాన్స్..!

Published : Apr 16, 2019, 02:03 PM IST
చిరు సినిమాలో సునీల్ కి ఛాన్స్..!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సై రా' సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సై రా' సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. కేరళాలో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్ అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకొని తరువాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ మొదలుపెడతారు. దాంతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది.

ఆ తరువాత వీఎఫ్ఎక్స్ కోసం సమయాన్ని కేటాయించనున్నారు. అయితే ఇప్పటినుండే చిరు తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. దర్శకుడు కొరటాల శివతో కలిసి చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు కొరటాల శివ.

అయితే ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ సునీల్ కి ఓ పాత్ర దక్కినట్లు తెలుస్తోంది. దీని గురించే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సునీల్ ఓ పెద్ద హీరో సినిమాలో నటించబోతున్నట్లు,  అది ఆడియన్స్ కి సర్ప్రైజ్ అంటూ పరోక్షంగా వెల్లడించాడు. ఆ సినిమానే ఇదని అని తెలుస్తోంది. నిజానికి గతంలో సునీల్ కి చిరు 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150'లో నటించే ఛాన్స్ వచ్చింది కానీ అప్పుడు కాల్షీట్స్ సర్దుబాటు చేయలేక సునీల్ ఆ ఆఫర్ వదులుకున్నాడు.

ఇప్పుడు మరోసారి చిరంజీవి నుండి పిలుపు రావడంతో సునీల్ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్  సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు