తగ్గాలి..పెరగాలి.. పాపం రకుల్ నలిగిపోతోంది!

Published : Apr 16, 2019, 01:45 PM IST
తగ్గాలి..పెరగాలి.. పాపం రకుల్ నలిగిపోతోంది!

సారాంశం

మన సౌతిండయన్ ఆడియన్స్ టేస్ట్ వేరు. హీరోయిన్ అంటే కాస్తంత ఒళ్లు ఉండాలి..కంటికి నదురుగా కనిపించాలి. 

మన సౌతిండయన్ ఆడియన్స్ టేస్ట్ వేరు. హీరోయిన్ అంటే కాస్తంత ఒళ్లు ఉండాలి..కంటికి నదురుగా కనిపించాలి. అయితే బాలీవుడ్ లో క్వయిట్ కాంట్రస్ట్ నడుస్తూంటుంది. అక్కడ హీరోయిన్స్ నాజూకుగా ,స్లిమ్ గా సైజ్ జీరోలో కనపడాలి. దాంతో అక్కడా ఇక్కడా హీరోయిన్ గా చేద్దామనుకునే హీరోయిన్స్ కు తిప్పలు తప్పటం లేదు. బాలీవుడ్ లో సినిమా చేసి తెలుగులోకి వస్తున్న రకుల్ ప్రీతి సింగ్ ...కు బరువు తగ్గటం, పెరగటం పనిగా పెట్టుకోవాల్సి వస్తోందని వాపోతోందట. 

రీసెంట్ గా రకుల్ తన బాలీవుడ్ చిత్రం దేదే ప్యార్ దే కోసం ఒక్కసారిగా పది కేజీలు బరువు తగ్గింది. ఆ చిత్ర దర్శకుడు రాజన్ పెట్టిన కండీషన్ తో తాను తగ్గానంది. అయితే అర్జెంటు గా బరువు తగ్గటంతో ఆమె ముఖంపై దాని ఎఫెక్ట్ పడింది. ఆమె ఓ పేషెంట్ లా ఉందంటూ విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆమె ఫొటో పెట్టి ట్రోల్ చేసారు. అయితే ఆ ఎపిసోడ్ ముగిసింది. ఇప్పుడు ఆమె మళ్లీ బరువు పెరగాలనుకుంటోంది.

నాగార్జున సరసన ఆమె మన్మధుడు 2 చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అందుకోసం దర్శకుడు ఇలా సన్నగా ఉంటే కుదరదు అని చెప్పేసాడట. దాంతో అర్జెంటుగా బరువు పెరిగే పోగ్రామ్ లు పెట్టుకుందని సమాచారం. 

2016లో ధృవ సినిమాతో చివరగా  హిట్ అందుకున్న రకుల్‌ తరువాత తెలుగులో ఒక్క సక్సెస్  కూడా సాధించలేకపోయింది. దీంతో ఈమె కెరీర్ కష్టాల్లో పడింది. అదే సమయంలో తమిళ, హిందీ ఇండస్ట్రీల మీద దృష్టి పెట్టడంతో తెలుగులో ఆఫర్స్ తగ్గాయి.

అయితే ఆ  ఇండస్ట్రీలలో కూడా ఆశించిన స్థాయి సక్సెస్‌లు దక్కకపోవటంతో రకుల్ తిరిగి టాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. టాలీవుడ్‌లో తిరిగి ప్రూవ్ చేసుకునేందుకు నాగ్ వంటి  సీనియర్ల సరసన నటించేందుకు కూడా ఓకె అంది. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా