డబ్బింగ్ కార్యక్రమాల్లో సునీల్-ఎన్.శంకర్ ల సినిమా

Published : Sep 01, 2017, 05:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
డబ్బింగ్ కార్యక్రమాల్లో సునీల్-ఎన్.శంకర్ ల సినిమా

సారాంశం

సునీల్ హీరోగా మరో కొత్త సినిమా రూపొందుతోంది మళయాళంలో సూపర్ హిట్ అయిన ‘ 2 కంట్రీస్’ సినిమాకి రిమేక్ గా ఇది తెరకెక్కుతోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తామన్న చిత్ర బృందం

సునీల్ హీరోగా మరో కొత్త సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రానికి  ‘జై బోలో తెలంగాణ’ చిత్ర దర్శకుడు ఎన్. శంకర్ దర్శకత్వం వహించారు. మళయాళంలో సూపర్ హిట్ అయిన ‘ 2 కంట్రీస్’ సినిమాకి రిమేక్ గా ఇది తెరకెక్కుతోంది.

 

మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలను  దర్శకనిర్మాత ఎన్.శంకర్ చెబుతూ.. "మలయాళంలో సూపర్ హిట్ అవ్వడమే కాక రికార్డ్ స్థాయిలో వసూళ్లు దక్కించుకొన్న "2 కంట్రీస్" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. సునీల్ కి సరిగ్గా సరిపోయే రోల్ ఇది, సినిమా చాలా బాగా వచ్చింది. సరికొత్త సునీల్ ను ఈ సినిమాలో చూడబోతున్నారు. షూటింగ్ పూర్తయ్యింది, ఇవాళే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలెట్టాం. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి.. టైటిల్ ను కూడా ప్రకటిస్తాం" అన్నారు.

 

నరేష్, సాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, పృధ్వీ, శ్రీనివాస్ రెడ్డి, సిజ్జు, దేవ్ గిల్, శివారెడ్డి, ఝాన్సీ, సంజన తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్