#OoruPeruBhairavakonaott: ‘ఊరు పేరు భైరవకోన’ OTT రిలీజ్ డేట్, స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్

By Surya PrakashFirst Published Feb 26, 2024, 8:08 AM IST
Highlights

ఏ ఎక్సపెక్టేషన్స్  లేకుండా  చూస్తే  మాత్రం బానే థ్రిల్ చేస్తుంది. వి.ఐ.ఆనంద్ గత చిత్రాలు తో పోల్చిచూడకపోతే ఓటిటిలోనూ ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది.

సందీప్ కిషన్ హీరోగా వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్..లు హీరోయిన్లుగా ‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమా రూపొంది క్రిందటి శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ కు వచ్చిన  రెస్పాన్స్ థియేటర్ లో రాలేదు.   మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా ఫస్ట్ వీకెండ్  బాగానే కలెక్ట్ చేసింది. సెకండ్  వీకెండ్ కి కూడా ఈ మూవీ కలెక్షన్స్ ఫరవాలేదనిపించాయి.  సినిమాలకు అన్ సీజన్ కావటంతో జనాలు పలచగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి వివరాలు బయిటకు వచ్చాయి.

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని  Zee5, Aha Video వారు తీసుకున్నారు! మార్చి మూడవ వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాసం ఉందని సమాచారం. ఫాంటసీ థ్రిల్లర్ కావటంతో థియేటర్ కన్నా ఓటిటిలో బాగా వర్కవుట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో సందీప్ కిషన్ సినిమాలకు వచ్చిన రెస్పాన్స్ కన్నా ఈ సినిమాకు బాగానే వచ్చినట్లు లెక్క.  

Latest Videos

చిత్రం కథేమిటంటే..

ఓ పెళ్లిలో నగలు దొంగతనంతో ప్రారంభమవుతుంది సినిమా. నగలు దొంగలించి బసవ(సందీప్ కిషన్) స్నేహితుడు (“వైవా హర్ష”)తో కలిసి అక్కడి నుంచి పారిపోతాడు. మార్గ మధ్యలో  యాక్సిడెంటల్ గా గీత(కావ్య థాపర్)ను కలుస్తాడు. తను కొట్టేసిన నగల కోసం పోలీసులు వెంటపడతారు వాళ్ళ నుంచి తప్పించుకునే క్రమంలో అనుకోకుండా “భైరవకోన” అనే ఊరిలోకీ ఎంటర్ అవ్వుతారు. భైరవకోనలోకి వచ్చాక అక్కడ ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడ మనుషులంతా విచిత్రంగా, భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా కధ ముందుకు సాగుతున్న కొద్దీ ఇంటర్వెల్ టైం కీ ఆ ఊరిలో ఉన్నవాళ్ళంతా మనుషులు కాదు దెయ్యాలని వాళ్లంతా చనిపోయి చాలా సంవత్సరాలుగా అక్కడే ఆత్మలుగా తిరుగుతున్నారని తెలుసుకుంటారు. ఐతే అదే ఊరిలో ఒక పాడు పడ్డ భవనంలో రవిశంకర్(అతను కూడా ఆత్మే)అక్కడున్న ఆత్మలన్నిటిని కంట్రోల్ చేస్తా ఉంటాడు. అసలు ఈ ఊరి కదేంటి అక్కడున్న మనుషులంతా చనిపోయి ఎందుకని భైరవకోన ఆత్మలుగా తిరుగుతున్నారు. ఈ ఊరి నుంచి ఈ ఆత్మల నుంచి ఈ ముగ్గురు ఎలా తప్పించుకొని బయటపడ్డారు అన్నదే ఈ సినిమా అసలు కధ.

ఇక ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) సినిమాకు రూ.9.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.9.85 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రీమియర్స్ తో కూడా కలుపుకుని రూ.7.57 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.2.28 కోట్ల షేర్ ను రాబట్టాలంటోంది ట్రేడ్.  ఈ చిత్రానికి శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘నిజమే నే చెబుతున్నా’ అనే పాట చార్ట్ బస్టర్ అవ్వడమే కాకుండా ఈ సినిమా పై అంచనాలు పెరగడానికి కూడా కారణమైంది. గతంలో సందీప్ కిషన్ – విఐ ఆనంద్ కాంబినేషన్లో ‘టైగర్’ అనే మూవీ వచ్చింది.
 

click me!