
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. దీనితో ఈ మూవీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న రిలీజ్ కి రెడీ అవుతోంది.
రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తన తనయుడు చిత్రం కావడంతో నాగబాబు కూడా హాజరయ్యారు.
నాగబాబు తన ప్రసంగంలో పొలిటికల్ కామెంట్స్ చేశారు. నాగబాబు వేదికపై పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే అభిమానులు ఒక రేంజ్ లో కేరింతలు కొట్టారు. దీనితో నాగబాబు అరవండి.. మీ అరుపులు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి అని అన్నారు. తాను ఇప్పుడే పవన్ కళ్యాణ్ ని మీట్ అయి వస్తున్నట్లు నాగబాబు తెలిపారు.
అయినప్పటికీ అభిమానులు కేరింతలు ఆపలేదు. దీనితో మీ ఎనేర్జి మొత్తం ఓట్లు గుద్దడంలో చూపించండి అని తేలిపోయారు. ఆ తర్వాత నాగబాబు ఇండియా ఆర్మీ గొప్పతనం, వాళ్ళు సాధించిన కొన్ని ఘనతలని నాగబాబు గుర్తు చేసుకున్నారు. తన ప్రసంగం చివర్లో.. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ తమ భర్తలని కోల్పోయిన వీరనారీమణులకు 6 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చిత్ర దర్శకుడు, వరుణ్ తేజ్, నిర్మాత వెళ్లి వారికి అందించాలని నాగబాబు రిక్వస్ట్ చేశారు.