‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ ఓటీటి రిలీజ్ డేట్

By Surya PrakashFirst Published Apr 29, 2021, 11:54 AM IST
Highlights

హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 5న థియేటర్లలో విడుదలైంది. ఇందులో సందీప్ కిషన్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహించగా.. టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.

విభిన్న కథా సినిమాల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. రీసెంట్ గా ఈ హీరో “ఏ1 ఎక్స్ ప్రెస్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 5న థియేటర్లలో విడుదలైంది. ఇందులో సందీప్ కిషన్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహించగా.. టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ చిత్రం ఓటీటి రిలీజ్ కు రిలీజైంది. సన్ నెక్ట్స్ , జియో సినిమా వారు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నారు. మే 1 తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

నేషనల్‌ హాకీ ప్లేయర్‌ సందీప్‌ పాత్రలో సందీప్‌ కిషన్‌ ,హాకీ క్రీడాకారిణిగా‌ లావణ్య త్రిపాఠి కూడా ఆకట్టుకుంది.సందీప్‌ కిషన్‌ తర్వాత బాగా పండిన పాత్ర మురళీ శర్మది. హాకీ కోచ్ పాత్రలొ ఆయన పరకాయ ప్రవేశం చేశాడనే చెప్పాలి. ఒక నిజాయతీగల కోచ్‌కు గేమ్‌పై, గ్రౌండ్‌పై ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమాలో మరళీ శర్మ పాత్ర చూపిస్తుంది. ఇక క్రీడాశాఖ మంత్రిగా రావు రమేశ్‌..ఒక అవినీతి రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో, స్వార్థం కోసం ప్రజల మధ్య ఎలా చిచ్చు పెట్టిస్తారనేది చూపించాడు.  

ఇప్పటివరకు రానీ హాకీ నేపథ్యంలో ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ తెరెక్కించడమనేది ముఖ్యంగా ఈ మూవీకి ప్లస్ అని చెప్పుకోవాలి. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు గిల్లికజ్జాలు, ఇతర నటీనటుల భావోధ్వేగాలతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులను హత్తుకునేలా ఉన్నాయి. స్పోర్ట్స్ తర్వాతా ఈ సినిమాకు కలిసివచ్చేది స్నేహబంధం. సందీప్ కిషన్, రాహుల్, ప్రియదర్శి మధ్య వచ్చే సన్నివేశాలను స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చేప్పే ప్రయత్నం చేశాడనుకోవచ్చు. చివరి 20 నిమిషాలు మాత్రం అదిరిపోతుంది. సినిమా చూస్తున్నామనే ఫీలింగ్‌ మర్చిపోయి హాకీ ఫైనల్‌ మ్యాచ్‌ని తిలకిస్తున్న భావన కలుగుతుంది. 

click me!